హమ్మయ్య బంగారం ధరలు తగ్గాయి అని అనుకునే లోపే మళ్లీ షాకిచ్చాయి. ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతున్నాయి. పసిడి ప్రియులకు ఊహించని షాకిస్తున్నాయి గోల్డ్ ధరలు. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. వంద, రెండు వందలు కాదు ఏకంగా తులం బంగారంపై రూ. 1050 పెరిగింది. ఒక్కరోజులోనే రూ. వెయ్యికి పైగా ధర పెరగడంతో గోల్డ్ లవర్స్ ఉసూరుమంటున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,810, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,520 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై ధర రూ. 1050 పెరగడంతో రూ. 78,100 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1150 పెరిగడంతో రూ. 85,200 వద్ద అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,100 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 85,200 వద్దకు చేరింది. హస్తినలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78250 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85350 వద్ద అమ్ముడవుతోంది.
బంగారం ధరలు పరుగులు పెడుతుండగా వెండి ధరలు మాత్రం తగ్గాయి. నేడు కిలో వెండిపై ఏకంగా రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో వెండి ధర గ్రాము రూ. 106, కిలో రూ. 1,06,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. వెయ్యి తగ్గడంతో రూ. 98500 వద్ద అమ్ముడవుతోంది.