గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ రెన్యువల్ కి సంబంధించిన లీగల్ టీమ్ సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా అమెరికన్ కాన్సులేట్ కి చేరుకున్నారు.. కేసీఆర్ తో పాటు జోగినపల్లి సంతోష్, జీవన్ రెడ్డి ఉన్నారు..
READ MORE: Vivo Y19 5G: రూ.10,499 లకే 6.74 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీ ఉన్న వివో స్మార్ట్ ఫోన్
ఈ ఏడాది ఫిబ్రవరి 19 కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే. పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం ఆయన కార్యాలయానికి వచ్చారు. ఆయనతో ఉన్న డిప్లమాటిక్ పాస్పోర్ట్ ను సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ ను తీసుకునేందుకు సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నందిని నివాసానికి బయలుదేరారు. తాజాగా మరోసారి గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు.
READ MORE: Amaravati Sabha: సైకిల్ యాత్రగా అమరావతి సభా ప్రాంగణానికి ఎంపీ కలిశెట్టి!