Bandi Sanjay : పాక్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుంటాయ్
- తుపాకీ పట్టినోడు ఆ తుపాకికే బలిగాక తప్పదు
- ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్గామ్ ఘటన
- 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించారు
- బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ది మారడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay :ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుండబోతున్నాయని అన్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు.
ఈరోజు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివ్రుద్ది కేంద్రంలో నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాశ్, వి.సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు… ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోడీ. 2022 అక్టోబర్ 22న ‘ప్రారంభమైన రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసినం.
Also Read
- Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
ఈరోజు 15వ రోజ్ గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. అంటే దాదాపు 10 లక్షల మార్క్ కు చేరుకున్నట్లే… ఏ చిన్న అవినీతికి, పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా ఇన్ని లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం మామూలు విషయం కాదు. మోడీ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కింది. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుంటే.. ఇతర ఉద్యోగులపై భారం పడుతోంది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించడం కష్టమైంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఏ శాఖలో ఖాళీగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆయా పోస్టులను ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసిన దాఖలాల్లేవ్. ఆ ఘనత మోడీకే దక్కుతోంది.
దేశవ్యాప్తంగా ఈరోజు 47 కేంద్రాల్లో రోజ్ గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. 51 వేల మందికి అపాయిట్ మెంట్ లెటర్లు ఇవ్వడం గొప్ప విషయం. మన రాష్ట్రం విషయానికొస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ లో నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఎంసీహెచ్ఆర్డీ కేంద్రం నుండి సుమారు 700 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోబోతున్నారు. వీరిలో 100 మంది అభ్యర్థులకు నా చేతుల మీదుగా నియమాక పత్రాలు అందించడం ఆనందంగా ఉంది. ఈరోజు అపాయిట్ మెంట్ లెటర్లు అందుకోబోతున్న అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు. వాస్తవానికి ఒక్కో పోస్టుకు భారీ ఎత్తున పోటీ నెలకొంది. ఆ పోటీని తట్టుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించిన మీ అందరికీ హ్యాట్సాఫ్..
ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించిన మీరంతా ఇకపై మీకప్పగించిన బాధ్యతలను ఇష్టపడి నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకోండి. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీని, ఉద్యోగాల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగండి. మీకు తెలుసు. ఉద్యోగావకాశాల సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది మోడీగారి సంకల్పం. అందుకే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకోగలిగాం. మాట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం నరేంద్రమోడీదే. గతంలో క్రమం తప్పకుండా వివిధ శాఖల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసిన దాఖల్లేవు. ఆ ఘనత మోడీకే దక్కుతోంది.
అంతేగాదు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పేరుతో ఉద్యోగాలు చేసే స్థాయి నుండి ఉద్యోగాలు స్రుష్టించే స్థాయికి మన భారతీయ యువతను ప్రోత్సహిస్తున్నారు. కరోనా హయాంలో అమెరికాసహా ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతే ఆత్మ నిర్భర్ ప్యాకేజీతో భారత్ ను ఆర్ధికంగా స్థిరంగా ఉంచిన ఘనత మోడీ ప్రభుత్వానిదే.
పేదలకు బ్యాంకు ఖాతాలు లేని పరిస్థితుల్లో ‘జన్ ధన్ ఖాతా’లను జీరో బ్యాలెన్స్ తో ప్రారంభిస్తామని చెబితే ప్రతిపక్షాలన్నీ హేళన చేశాయి. ఈరోజు దేశంలో బ్యాంకు ఖాతా లేని ప్రతి ఒక్కరికి జన్ ధన్ ఖాతాను ప్రారంభించి నయాపైసా అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఒకనాడు నిత్యావసర వస్తువులు సహా అనేక వస్తువులను భారత్ దిగుమతి చేసుకునేది. మోడీ హయాంలో బియ్యం, నిత్యావసర వస్తువులుసహా అనేక ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చారు.
మన రాష్ట్రం విషయానికొస్తే… గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైంది. పేపర్ లీకేజీలు, కాలయాపనతో నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వాటికి తావులేకుండా క్రమం తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.
అంతేగాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అగ్రభాగాన నిలిచేందుకు నిరంతరం క్రుషి చేస్తున్నారు. గతంలో 11వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానంలో నిలిపారు. మరో మూడేళ్లలో 3వ స్థానానికి తీసుకువచ్చే దిశగా పనిచేస్తున్నారు. అట్లాగే భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా అప్పటికి అమెరికా, చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలన్నదే మోడీ ఆకాంక్ష. మోడీ క్రుషిలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్‌స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!