మెట్రో రైలు కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతి లభించింది. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. కారిడార్ 4లో నాగోల్ - శంషాబాద్, కారిడార్ 5లో రాయదుర్గం - కోకాపేట, కారిడార్ 6లో ఓల్డ్ సిటీ mgbs - చాంద్రాయణగుట్ట, కారిడార్ 7లో మియపూర్ - పఠాన్ చెరు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ - హయత్ నగర్, కారిడార్ 9లో ఎయిర్ పోర్టు - ఫోర్త్ సిటీ రానున్నాయి.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగటంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన డీపీఆర్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టి రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థనే ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్ సమీప పురపాలక సంఘాల్లోనూ…
Hyderabad Mayor: మెట్రోలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి ప్రయాణించారు. మూసరంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు మేయర్ ప్రయాణించారు.
Hyderabad Metro: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రోకి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో మోట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు.
Mr Bachchan Promotions in Hyderabad metro trains: ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా “మిస్టర్ బచ్చన్”. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా అందరిలాగే కాకుండా మిస్టర్ పర్చన్ టీం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగా రవితేజ వాయిస్ మెసేజ్ ను…
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో అడ్వాన్స్డ్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీ. విదేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్ (ఓటీఎస్)ను ప్రవేశపెట్టబోతోంది.
Hyderabad Metro: మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల రెడ్‌లైన్‌లో రైళ్లు నిలిచిపోయాయని మెట్రో రైలు నిర్వాహకులు తెలిపారు.