Hyderabad Metro : హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త.. మేడ్చల్, శామీర్‌పేట్ వరకు మెట్రో పొడగింపు..!
- హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త
- ముఖ్యమంత్రి నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్ పేట్ లకు మెట్రో పొడగించాలని నిర్ణయం
- డీపీఆర్ సిద్ధం చేయవలసిందిగా సీఎం ఆదేశం : హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro : హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోమీటర్లు); జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్ ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్ లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’ భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించవలసిందిగా హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఈ రోజు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దానకిషోర్, హెచ్ఏఎంఎల్ ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో చర్చించి ముఖ్యమంత్రి ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది
Also Read
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి తాడ్ బన్డ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ కు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది; అదే విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకింపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్ కు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ముఖ్యమంత్రి గారికి వివరించారు. గత మల్కాజ్ గిరి యంపీ గా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ ల రూట్ మ్యాప్ లపై తనకు మంచి అవగాహన ఉందని, అయినా రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి మెట్రో ఎండీని ఆదేశించారు.
డీపీఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్టు ఎండీ చెప్పారు. మెట్రో ఫేజ్-2 ‘ఏ’ భాగం లాగే ‘బి’ భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మెట్రో ఎండీ తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు వెంటనే డీపీఆర్ మరియు ఇతర అనుబంధ డాక్యుమెంట్ ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
Israel: అక్టోబర్ 07 దాడులకు నేతృత్వం వహించిన హమాస్ కమాండర్ హతం..
తాజావార్తలు
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..