Hyderabad Metro Phase II: ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశం అయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇటీవల 20 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలు ధరలు తగిలించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ, అధిక టికెట్ రేట్లు నగర ట్రాఫిక్‌ను మరింతగా పెంచుతాయని హెచ్చరించారు. Mukesh Ambani: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంపై మోడీకి ముఖేష్ అంబానీ అభినందనలు ఈ నేపథ్యాన్ని…
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పడం లేదు. ఇటీవల మెట్రో ఛార్జీల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నేటి నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. Also Read:IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునః ప్రారంభం.. ఆర్సీబీ,…
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను పెంచే అవకాశాలపై తాజాగా సంకేతాలు వెలువడ్డాయి. మెట్రో వర్గాల సమాచారం ప్రకారం, మే రెండో వారంలో సవరించిన టికెట్ రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన భారత్‌కు చేరిన తర్వాతే ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ టారిఫ్ సవరణలతో…
Hyderabad Metro: హైదరాబాద్ నగరంలోని మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ట్రైన్ ఆగిపోయింది. దాదాపుగా 20 నిమిషాల పాటు భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రైలు నిలిచిపోయింది.
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ, మెట్రో అధికారులు ప్రత్యేకంగా మహిళల కోసం “TUTEM” అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బిట్స్ పిలానీ-హైదరాబాద్, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ పోలీస్, ఐఐటీ ఖరగ్పూర్ , ముంబయికి చెందిన పలు సంస్థలు కలిసి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) సహకారంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి. ఈ సందర్భంగా…
మెట్రో రైలు లో బెట్టింగ్ ప్రమోషన్ ఫై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో రైల్లో బెట్టింగ్ ఆప్ ప్రమోషన్‌పై హైకోర్టులో పిల్ దాఖలైంది. అడ్వకేట్ నాగూర్ బాబు ఈ పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్ పై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందులో పేర్కొన్నారు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో ఐఏఎస్, ఐపీఎస్ లు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.
Hyderabad Metro: 2017లో ప్రారంభమమైన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) ప్రాజెక్టుగా నిలిచింది. ఈ మెట్రో సేవలు నగరంలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ప్రతిరోజూ లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి. అధిక రహదారి ట్రాఫిక్, కాలుష్య సమస్యల నేపథ్యంలో మెట్రో సేవలు నగర ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ రూ.6,500 కోట్లకు…
ప్రజావసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు…. హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం,…