Mr Bachchan Promotions in Hyderabad metro trains: ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా “మిస్టర్ బచ్చన్”. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా అందరిలాగే కాకుండా మిస్టర్ పర్చన్ టీం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగా రవితేజ వాయిస్ మెసేజ్ ను ఉపయోగించి ప్రమోషన్ ను ఓ రేంజ్ లో చేసేస్తోంది. ఇక ప్రమోషన్ సంబంధించి తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ మెట్రో రైల్లను ఎంపిక చేసుకుంది.
Sexual Harassment: ఛీ.. ఛీ.. కామాంధుడా.. నీ వయసేంటి.? చేసే పనేంటి..?
మెట్రో ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం.. అంటూ.., ఏం తమ్ముళ్లు.. మెట్రోలో ప్లేస్ దొరకలేదా.? లేకుంటే కూర్చోగానే లేపేస్తున్నారా.? అయినా పర్లేదు.. మిస్టర్ బచ్చన్ నుండి లేటెస్ట్ గా పాట రిలీజ్ అయింది.. హ్యాపీగా వినుకుంటూ నిల్చొని మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా వెళ్లండి అంటూనే.. ఇక్కడ సీటు దొరకపోయినా పర్లేదు.. ఆగస్టు 15న సినిమా థియేటర్ కు వచ్చేయండి అక్కడ సీటు గ్యారెంటీ అంటూ హీరో రవితేజ వాయిస్ మెసేజ్ తో ప్రయాణికులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ వాయిస్ మెసేజ్ వింటున్న మెట్రో ప్రయాణికుల హావభావాలకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Champions Trophy 2025: వామ్మో.. ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల ఖర్చు..?
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలకు సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇకపోతే ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ తో పాటు రామ్ పోతినేని నటించిన ” డబుల్ ఇస్మార్ట్ ” సినిమా కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
#RaviTeja greets Hyderabad Metro Riders in a First of its kind Audio Promotions for a Telugu Movie!#MrBachchan pic.twitter.com/SLcF8ARhkO
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 1, 2024