Koti Deepotsavam Day 12: కార్తీకమాసం పర్వదినాల్లో భాగంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పన్నేండవ రోజు కార్యక్రమాలు అద్భుత ఆధ్యాత్మిక వైభవంతో మెరిశాయి. ఎన్టీఆర్ స్టేడియం భక్త కోలాహలం మధ్య శివ నామస్మరణతో మార్మోగింది. వేలాది భక్తులు ఒకే స్వరంతో “ఓం నమః శివాయ” జపిస్తూ వెలిగించిన దీపాలు ఆ ప్రాంగణాన్ని దివ్యజ్యోతి ప్రదేశంగా మార్చేశాయి. ప్రతి దీపం ఆత్మజ్యోతి సందేశాన్ని అందిస్తూ భక్తుల హృదయాలను పరవశింపజేసింది. 2012లో ఆరంభమైన…
Koti Deepotsavam 2025 Day 6: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్యాత్మిక ప్రకాశంతో తళుక్కుమంది. భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 మహోత్సవం ఆరవ రోజు అద్భుతమైన భక్తి తరంగాలతో సాగింది. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహోత్సవం, ప్రతిరోజూ భక్తులకు ఆత్మీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ ఆధ్యాత్మిక…
DMF Awards : భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 హైదరాబాద్ లోని HICC కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ ను సినిమాటికా ఎక్స్‌పోతో కలిసి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించింది. ఇందులో కంటెంట్ క్రియేటర్స్, సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు, కొందరు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ గెస్ట్ గా I&PR ప్రత్యేక కమిషనర్ ప్రియాంక పాల్గొని అవార్డులు అందజేశారు. డిజిటల్ క్రియేటర్స్ నేటి రోజుల్లో చాలా అవసరం అన్నారు. వారందరికీ…
Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన వేడుకలకు తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది.
Koti Deepotsavam 2025 Day 1: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ప్రతి ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా మొదటి రోజు కార్యక్రమం జరిగింది. వేలాదిగా పాల్గొన్న భక్తుల శివనామస్మరణతో వేదిక మార్మోగింది. కార్తీకమాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా అంధకారాన్ని తొలగించి ఆత్మజ్యోతి ప్రకాశించనిచ్చే సంకేతంగా భావిస్తారు.…
Allu Sirish Engagement: హైదరాబాద్‌లో శుక్రవారం అల్లు కుటుంబంలో శుభకార్యం జరిగింది. ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే సాగింది. చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.…
Nagarjuna : హీరో నాగార్జునను హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న ఆయన నిర్వహించబోయే అలైబలై కార్యక్రమానికి రావాల్సిందిగా నాగార్జునను కోరారు. దానికి నాగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతి ఏడాది దసరా తెల్లారి దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా దీన్ని నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు దత్తాత్రేయ.…
Sapta Sindhu 2025 : హైదరాబాద్‌లో AE ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సప్తసింధు-2025 – ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు” (Inter College Temple Model Making Competition) ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. బుధవారం టీ-హబ్‌లో జరిగిన ఈ పోటీలు విద్యార్థులు రూపొందించిన ఆలయ నమూనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన పద్మశ్రీ బృహత్ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ, “భారతీయ దేవాలయాల సృజనాత్మకత, శిల్ప సంపద ప్రపంచాన్ని…
SWAN Green Carnival : హైదరాబాద్ నగరం మరోసారి పర్యావరణ పరిరక్షణకు తన నిబద్ధతను చాటుకుంది. జూన్ 14న ఫౌంటన్హెడ్ గ్లోబల్ స్కూల్ ప్రాంగణంలో సేవ్ వాటర్ అండ్ నేచర్ (SWAN) అనే ప్రముఖ ఎన్జీఓ ఆధ్వర్యంలో “గ్రీన్ కార్నివాల్” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి SWAN అధ్యక్షురాలు, చైర్పర్సన్ శ్రీమతి మేఘన ముసునూరి నేతృత్వం వహించారు. కార్నివాల్కు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు హాజరై పర్యావరణ పరిరక్షణకు తమ పూర్తి మద్దతు తెలిపారు.…