Koti Deepotsavam 2025 Day 6: కమనీయం కడు రమణీయం సీతారాముల కళ్యాణం
- హైదరాబాద్లో భక్తి కాంతులతో మెరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- మహాస్వాముల అనుగ్రహ భాషణాలతో ఆధ్యాత్మిక స్పూర్తి
- సప్తహారతి, లింగోద్భవ దర్శనంతో ముగిసిన ఆరవ రోజు ఉత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 Day 6: హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్యాత్మిక ప్రకాశంతో తళుక్కుమంది. భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 మహోత్సవం ఆరవ రోజు అద్భుతమైన భక్తి తరంగాలతో సాగింది. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహోత్సవం, ప్రతిరోజూ భక్తులకు ఆత్మీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది.
2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ ఆధ్యాత్మిక యజ్ఞం, ఇప్పుడు ప్రపంచస్థాయిలో భక్తి ఉత్సవాలకు ప్రతీకగా నిలిచింది. వేలాది మంది భక్తులు “ఓం నమః శివాయ” నినాదాలతో దీపాలు వెలిగించగా, వేదికపై ఏర్పడిన ఆ వెలుగుల సముద్రం కైలాసాన్ని తలపించింది. “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే సందేశం మరింత హృదయాలను తాకింది.
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..
- Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
- Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..

ఆరవ రోజు కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక వైభవం మరింత అద్భుతంగా కనిపించింది. పూజ్యశ్రీ విశ్వప్రసన్నతీర్థ మహాస్వామీజీ (పెజావర్ మఠం, ఉడుపి), పూజ్యశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామీజీ (కాశీ జగద్గురు) ఆధ్వర్యంలో జరిగిన అనుగ్రహ భాషణం భక్తుల మనసులను దోచుకుంది. బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తి ప్రవచనామృతం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం అలరించింది.
వేదికపై కొండగట్టు ఆంజనేయ స్వామికి కోటి తమలపాకుల అర్చన, భద్రాచలం శ్రీరామ మహాపూజ, యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామివారి కల్యాణం, భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించబడ్డాయి. చివరగా హనుమంత వాహన సేవ, సప్తహారతి, లింగోద్భవ దర్శనంతో ఆరవ రోజు ఉత్సవం కన్నుల పండువగా ముగిసింది.
ఈ పవిత్ర ఉత్సవం నవంబర్ 13 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. భక్తి, ఆరాధన, ఆనందాల సమ్మేళనంగా సాగుతున్న కోటి దీపోత్సవం 2025 భక్తులందరికీ జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది.
కోటి దీపోత్సవం ఆరో రోజున సకలశుభాలు అనుగ్రహించే భద్రాచలం శ్రీరామునికి దర్బారుసేవ..#GarikapatiNarasimhaRao #BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/KUJFd5Y6ha
— BhakthiTV (@BhakthiTVorg) November 6, 2025
కోటి దీపోత్సవం ఆరో రోజున కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన#GarikapatiNarasimhaRao #BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/JpVIDRh3CP
— BhakthiTV (@BhakthiTVorg) November 6, 2025
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..