CM Chandrababu: సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టే గుంటూరు- విజయవాడ మధ్య జిల్లాలో రాజధానిగా ప్రకటించాం.. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ పెడితే అవహేళన చేశారు.. హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు భారీగా ఉన్నాయి.. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది అన్నారు. అమరావతి నిర్మాణానికి దారిచూపింది ఇక్కడ రైతులు.. ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములు ఇచ్చారు.. ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములు ఇచ్చింది అమరావతి రైతులే.. సచివాలయం, అసెంబ్లీ కట్టేలోపు ట్రాన్సిట్ నిర్మాణంలో చేశాం.. రాజధాని రైతులు మహిళలు పెద్దఎత్తున పోరాడారు.. మీ ఉద్యమ ఫలితమే ఈ భవన నిర్మాణం పూర్తి.. రాజధాని ఎక్కడ ఉంది, ఇది వేశ్యల రాజధాని అంటూ తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: Kantara : వాచిపోయిన కాళ్లు, అలసిన శరీరం – కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి గాధ
అయితే, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి 177 కోట్ల రూపాయలు పలుకుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ అనేక భారీ ప్రాజెక్టులు రావడం వలన అభివృద్ధి జరిగింది.. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఒక వడ్డాణం లాగా ఏర్పాటు చేశాం.. అలాగే, ఎన్టీఆర్ హయాంలో అబిడ్స్ నగరం ఏర్పాటు అయింది. ఇప్పుడు సైబరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత అబిడ్స్ ను మరచిపోయారు అని చెప్పుకొచ్చారు. అలాగే, విజయవాడ- గుంటూరు ఎంత అభివృద్ధి చెందినా అమరావతి అభివృద్ధి భారీగా ఉంటుంది.. ఇప్పుడు అమరావతి ఇలాగే అభివృద్ధి చెందితే మున్సిపాలిటీగా ఉంటుంది.. ఇక్కడి రైతులు నెక్స్ట్ లెవెల్ లో ఆలోచించాలి.. అమరావతి ఫ్యూచర్ సిటీ.. దీనికి అద్భుతమైన డిజైన్ ఇచ్చింది సింగపూర్ సంస్థ అని పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నాను.. త్వరలోనే వైజాగ్ లో భారీ డేటా సెంటర్ వస్తుంది.. ఇప్పుడు ప్రపంచం మొత్తం AI వైపు అడుగులు వేస్తోంది.. భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.