హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్స్‌ను డిపోర్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్ పోర్ట్ లతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వాళ్లను కూడా అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను ప్రారంభించిన ఆయన కార్యక్రమంలో ప్రసంగించారు. నైజీరియన్లను వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తారని భయంతో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సంచలన విషయాన్ని తెలిపారు.
మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్...హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు 24 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఆదివారం పూర్తిగా మూతపడనున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున వాడవాడలా రామనామ స్మరణ మార్మోగుతున్న నేపథ్యంలో.. నేడు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకుని రేపు మీరాలం ఈద్గాలో నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను ప్రార్థనలు ముగిసేంత వరకు దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి.
Hyderabad CP CV Anand: హైదరాబాదులో మెగాసిటీ పోలీస్ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. పోలీస్ వ్యవస్థ పునర్ వశీకరణ ప్రారంభానికి సన్నాహాలు మొదలయ్యాయి. హైదరాబాదులో కొత్తగా 40 పోలీస్ స్టేషన్ కి ఏర్పాటు చేయన్నారు అధికారులు.
నుమాయిష్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ నుమాయిష్ ఈ సంవత్సరం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఆలస్యం ప్రారంభమైంది. ఈ నుమాయిష్‌లో వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది వ్యాపారులు వస్తుంటారు. అనేక రకాల వంటకాలు, వస్తువులు ఇంకా ఎన్నో ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ నుమాయిష్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైద్రాబాద్ ట్రాఫిక్ విభాగం లో నేను…
సిటీ పోలీస్ తరపున మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హోం గార్డ్ స్థాయి నుండి డీసీపీ వరకు మహిళా పోలీస్ అధికారిణి లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమయినది. అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుంది… యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కూడా మహిళలు ముందు ఉండి నడిపిస్తున్నారు. ఇటీవల సినిమాలలో కూడా మహిళల…
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయిన ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇటీవలే బిజినెస్ మన్ లు వైద్యులు, ఇప్పుడు తాజాగా ఐ టి ఎంప్లాయిస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ కేసులో ఎవరి ప్రమేయం ఉన ఎంతటి వారినైనా వదిలేది లేదని నగర పోలీస్ బాస్ హెచ్చరించారు నార్కోటిక్స్…
హైదరాబాద్ నగరంలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ మేరకు మలక్‌పేట్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అంత రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్‌రాష్ట్ర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్…