Hyderabad CP CV Anand Reveals Cheating Case Of Herbal Products: స్వప్న లోక్ అగ్నిప్రమాద ఘటన గుర్తుందా? ఈ ప్రమాదం జరిగిన తర్వాత Q మార్ట్ మోసాలు బయటకు వచ్చాయి. ఈ మోసాలపై దర్యాప్తు చేస్తుండగా.. మరో ముఠా పట్టుబడిందని తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ముఠా ఢిల్లీ, ఘజియాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతోందని చెప్పారు. హెర్బల్ ప్రాడక్ట్స్ పేరుతో దేశవ్యాప్తంగా 7 వేల మందిని ఈ ముఠా సభ్యులు మోసం చేశారని కుండబద్దలు కొట్టారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ.200 కోట్ల వరకు వీళ్లు దోచుకున్నారని షాకింగ్ వివరాలు బయటపెట్టారు. చట్ట ప్రకారం.. మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్‌లు నేరమన్నారు. అయితే.. ఈ ముఠా సభ్యులు హెర్బల్ ప్రాడక్ట్స్ పేరుతో, అమాయకుల్ని మోసం చేశారని, వారి నుంచి దారుణంగా భారీ మొత్తం దోచుకున్నారని చెప్పారు.
PM Modi Tour: వరంగల్‌లో మోడీ పర్యటన.. బహిష్కరించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్ పేరుతో ఉన్న స్కీమ్‌లో రూ.6 లక్షలు కడితే.. 30 నెలల పాటు నెలకు 30 వేలు ఇస్తామని ఈ ముఠా సభ్యులు ఓ స్కీమ్ పెట్టారని సీవీ ఆనంద్ తెలిపారు. ఐడీ స్కీమ్‌లో రూ.9999 కడితే.. నెలకు రూ.880 చొప్పున 36 నెలలపాటు ఇస్తామని నమ్మించారన్నారు. పర్ఫెక్ట్ బజార్ పేరుతో ఉన్న మరో స్కీమ్‌లో 25 లక్షలు కడితే.. నెలకు రూ.1లక్ష చొప్పున 36 నెలలు ఇస్తామని నమ్మబలికారని అన్నారు. ఇవే కాకుండా… హిల్ స్టేషన్ టూర్, ల్యాప్‌టాప్స్, బైక్స్, జ్యువెలరీ, ఫ్లాట్, కార్లు బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటనలు ఇచ్చారన్నారు. వీరిచ్చిన ఈ ప్రకటనల పట్ల ఆకర్షితులై.. జనాలు మోసపోయారన్నారు. ఈ కేసులో తాము రియాజుద్దీన్, బాబి చౌదరీలను అరెస్ట్ చేశామని.. షకీలా, పూజా కుమారి పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి ప్రకటనలు చూసి అమాయకులు మోసపోవద్దని సూచించారు. డబ్బులు ఎవరూ ఊరికే ఇవ్వరని.. జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
Ponnam Prabhakar: బీజేపీ డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకునేందుకే మోడీ పర్యటన