Hyderabad CP CV Anand: హైదరాబాదులో మెగాసిటీ పోలీస్ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. పోలీస్ వ్యవస్థ పునర్ వశీకరణ ప్రారంభానికి సన్నాహాలు మొదలయ్యాయి. హైదరాబాదులో కొత్తగా 40 పోలీస్ స్టేషన్ కి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ లా అండ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు కానుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు మొదలయ్యాయి. 35 సంవత్సరాల తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీస్ స్టేషన్ల పెంపు, జోన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. పునర్వ్యవస్థీకరణ కమిటీ 6 నెలల పాటు కూర్చుని కొత్త పోలీస్ స్టేషన్లను ప్రతిపాదించిందని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 35 ఏళ్ల క్రితం 25 లక్షల జనాభా ఉండేదని, ఇప్పుడు 85 లక్షలకు పెరిగిందన్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లు కలిపి 1.60 కోట్ల మంది ప్రజల శాంతి భద్రతలను అదుపు చేస్తున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కొత్త డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 5 కొత్త మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. కేసులు పెరుగుతున్న కొద్దీ పోలీస్ స్టేషన్లు భారంగా మారుతున్నాయన్నారు. సచివాలయానికి కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని… బీఆర్కేలో సచివాలయ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ భద్రత కోసం ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహించనున్నారు. సైబర్ క్రైమ్‌ల కోసం ఒక డీసీపీతో పాటు 148 మంది పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు.
జూన్ 2 నుంచి కొత్త పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని.. 35% సివిల్ కానిస్టేబుళ్లు, 120 ఎస్ ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొత్త పోలీస్ స్టేషన్లకు అనువైన వాహనాలు, కంప్యూటర్లు, బైక్ లు అందజేస్తామని వెల్లడించారు. కొత్త పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించిందని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. కొత్త పోలీస్ స్టేషన్లతో కలిపి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 78 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ కలెక్టరేట్ భవనాన్ని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌గా మార్చారని అన్నారు. బీఆర్కే భవన్‌లోని సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ ఫిలింనగర్‌లోని ఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రెహ్మత్ నగర్ ఓపీ భవనం మధురానగర్ పోలీస్ స్టేషన్, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలోని ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్, హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ భవనంలోని మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్, బోరబండ పోలీస్ స్టేషన్ వద్ద బోరబండ అవుట్ పోస్ట్ పోలీస్ ఏర్పాటు చేయనున్నట్లు సీపీ ఆనంద్ వెల్లడించారు.
Fast food: ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? యమ డేంజర్..