కోవిడ్ టైంలో కొంత మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది అమ్మాయిలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారని, డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. ఓచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎంప్లాయ్ మెంట్ రెండు మాదక…