హుజురాబాద్ లో టీఆర్ఎస్ దే నైతిక విజయం అని ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నన్ను ఓడించాయన్నారు. ఓటమికి నేనే నైతిక బాధ్యత వహిస్తున్నానని ప్రకటించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఈ ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ కు అభినందనలు తెలిపారు. ఇక, దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోరాడుతాయి… కానీ, హుజురాబాద్ మాత్రం కలసి పని చేస్తాయని ఆరోపించారు. ఒక విద్యార్థి నాయకునిగా సీఎం కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారన్న ఆయన.. పార్టీ కోసం పని చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.. రాబోయే రోజుల్లో హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటా… ప్రజలకు సేవ చేస్తా… పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని పేర్కొన్నారు గెల్లు శ్రీనివాస్.