హుజురాబాద్ గెలుపు క్రెడిట్ బీజేపీది కాదు : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ లో బీజేపీ విజయం ప్రజల విజయం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు నీతికి, న్యాయానికి మద్దతుగా నిలిచారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ కి మద్దతు ఇచ్చిన హుజురాబాద్ ప్రజానీకానికి, నా తరపున కేంద్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. ఖర్చుతో కూడుకున్న ఎన్నికల్లో పాలక పార్టీ మభ్యపెట్టినా, వాటిని లెక్క చేయకుండా ప్రజలు బీజేపీ కి ఓటు వేసి గెలిపించారు. హుజురాబాద్ ప్రజలు చరిత్ర తీరగరాశారు. 40 ఏళ్లలో ఈ తరహా ఎన్నికలు చూడలేదు. ఈటల తరువాత ఎక్కువ పర్యటనలు చేసింది నేనె. హుజురాబాద్ ఎన్నికల కోసం వేలాది కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారు. డబ్బుకు, పధకాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేఛ్చగా ఓటుహక్కు వినియోగించుకున్న హుజురాబాద్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా అన్నారు.
ఇక ఈటల రాజేందర్, బీజేపీ పై విశ్వాసం ఉంచి ప్రజలు తీర్పు ఇచ్చారు. నైతిక విలువలున్న ప్రతి ఒక్కరూ సంతోష పడతారు. ధర్మం ,నీతి నిజాయితీకి పట్టం కట్టారు. అహంకారాన్ని,అవినీతిని ప్రజలు వ్యతిరేకించారు. కేసీఆర్ చిత్తశుద్ధి పట్ల ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నది తేట తెల్లమైంది. అభ్యర్థులు పార్టీ పై విశ్వాసం ఉంచితే ఎన్ని డబ్బులు పెట్టినా అది పనిచేయదని నిరూపితమైంది. రాజకీయలకి దిశానిర్దేశం చేసేలా నైతిక విలువలతో కూడిన ప్రయత్నం హుజురాబాద్ ప్రజలు చేశారు. హుజురాబాద్ ప్రజలను ఎంత పొగిడినా తక్కువే. హుజురాబాద్ ప్రజలకు బీజేపీ రుణపడి ఉంటుంది..అండగా ఉంటుంది. ఎన్నికలు చిన్నవిషయం అంటూనే ప్లినరీ పెట్టారు. అబద్దాలను అన్నిసార్లు నమ్మరు. హుజురాబాద్ ఎన్నికల్లో మా పార్టీ ఖర్చుకు, టీఆర్ఎస్ కు పోలికే లేదు అని తెలిపారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
అయితే కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ తీసుకుంటే మాకు కాంగ్రెస్ ఎలా సహకరిస్తుంది. కాంగ్రెస్ తో పొత్తు ఏదైనా ఉంటే టీఆర్ఎస్ కె ఉంటుంది. హుజురాబాద్ ఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. హుజురాబాద్ హీరోలు ప్రజలు, ఈటల రాజేందర్. గెలుపు క్రెడిట్ బీజేపీది కాదు..ప్రజలదే. ఈటల వ్యక్తిత్వం కూడా గెలుపుకు తోడైంది. ఎన్నికలకు ముందే ఈటల రాజేందర్ ను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించాం. బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యులు అంటే రాష్ట్ర అధ్యక్షుడితో సమానం. హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ లో బీజేపీకి మంచి భవిష్యత్తును ఇస్తుంది. తెలంగాణకు ద్రోహం చేసినవారు కేసీఆర్ పక్కనే కూర్చుంటున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నపుడు ఖచ్చితంగా తెలంగాణలో మార్పు వస్తుంది. నాయకులను బీజేపీలోకి రాకుండా ఎవరూ ఆపలేరు. బీజేపీ ని, సిద్ధాంతాలను నమ్మి వచ్చే వారిని బిజెపి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. చేరికలు ఏమైనా ఉంటే ముందే చెప్తాం. రేపు అయోధ్యలో జరిగే “దీపోత్సవ” కార్యక్రమానికి హాజరవుతాను. రేపు సరయు నది ఒడ్డున 12 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నాం. అనేక మంది కళాకారుల ప్రదర్శనలు,లేజర్ షో లో పాల్గొంటాను. ఎల్లుండి కేరళలో కలాడి గ్రామానికి వెళ్తాను. ఆది శంకరాచార్యులు జన్మించిన గ్రామం. ఈ నెల ఐదో తేదీ కేదర్ నాథ్ కు ప్రధాని మోడీ వెళ్తారు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!