ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతలు తిష్టవేసి పావులు కదుపుతున్నారు.. ఈ సమయంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు ముద్దసాని కశ్యప్ రెడ్డి.. ఇవాళ గులాబీ పార్టీ గూటికి చేరారు.. ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆయనకు పేరుంది… వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన కశ్యప్ రెడ్డి.. కాసేపటి క్రితం.. మంత్రులు హరీష్ రావు, కొప్పుల…
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వంశస్థులు… అవినీతిపరులు ఓడిపోతారని వ్యాఖ్యానించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కమలం, కేసీఆర్ అహంకారంని అణిచి వేస్తుందన్న ఆయన.. తెలంగాణ ప్రజలు, కేసీఆర్ ఆహంకారానికి మధ్య జరుగుతున్న పోరు ఇదిగా అభివర్ణించారు.. కేసీఆర్ రైతులను.. యువకులను మోసం చేశారని ఆరోపించిన తరుణ్ చుగ్.. కేసీఆర్ అహంకారం దిగుతుంది.. ఈటల రాజేందర్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు.. తెలంగాణలో వారసత్వ రాజకీయాలను అంతం…
హుజురాబాద్ ఉపఎన్నిక బాధ్యతలను టీఆర్ఎస్ ఆ ఇద్దరు నేతలకు అప్పగించిందా? వెంటనే వారు రంగంలోకి దిగిపోయారా? క్షేత్రస్థాయి కార్యకర్తలు.. లోకల్ లీడర్స్‌తో టచ్‌లోకి వెళ్లారా? హుజురాబాద్‌లో గులాబీ పార్టీ అనుసరిస్తున్న కొత్త వ్యూహం ఏంటి? ఇంతకీ ఎవరా నాయకులు? లెట్స్ వాచ్! అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఐదు ఉపఎన్నికలు ఉపఎన్నికలను ఎదుర్కోవడంలో టీఆర్‌ఎస్ వ్యూహాలు ఇతర పార్టీలకు భిన్నంగా.. దూకుడుగా ఉంటాయి. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అయిదు ఉపఎన్నికలను ఎదుర్కోంది. మొదటిసారి…
భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్.. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి చివరకు ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ పెద్దలను కలిసి తన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.. ఆ తర్వాత టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పడం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. మళ్లీ విమానంఎక్కి హస్తినకు వెళ్లి కాషాయ కండువా కప్పుకోవడం జరిగిపోయాయి.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన నియోజకవర్గం హుజూరాబాద్‌పై ఫోకస్ పెట్టిన ఆయన.. తన వెంటన వచ్చిన టీఆర్ఎస్…
ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవని అంటారు. హుజురాబాద్‌లో ప్రస్తుతం అదే పరిస్థితి ఉందట. ఒకప్పుడు నువ్వా నేనా అని కత్తులు దూసుకున్న మాజీ మంత్రులు ఇప్పుడు ఒకే గూటిలోకి వచ్చారు. అయినప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారట. అదే అక్కడి రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రులు.. ఏంటా పంచాయితీ? లెట్స్ వాచ్! హుజురాబాద్‌లో మారుతున్న సమీకరణాలు! మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా కమలనాథులు సంతోషంగా ఉంటే.. తెరవెనక వారిని కలవరపెడుతున్న…
ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ మారినప్పటి నుంచి.. ఈటలపై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బిజెపి నేత పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ నియోజకవర్గం లో అభివృద్ధి జరగలేదని… తాను చేసిన అభివృద్ధి కనబడుతుందని తెలిపారు. ఎన్నికలు ఇప్పుడే రావని.. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ మారినప్పటి నుంచి.. ఈటల పై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. ఢిల్లిలో ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని.. ఫ్లైట్ లో వెళ్లి బీజేపీలో చేరిన ఈటలకు బీజేపీ అధ్యక్షులు కూడా టైం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఈరోజు గుడ్డి…
హుజూరాబాద్ పట్టణం లో నీ సాయి రూప గార్డెన్ లో 260 మంది లబ్ధిదారులకు 2,60,30,160 రూపాయల షాది ముబారక్,కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసారు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రపంచం లో, దేశం లో ఎక్కడ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు లేవు. ముఖ్యమంత్రి బడుగు,బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించాడు. రాష్ట్రం లో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన…
ఈటల చేస్తున్న ఆరోపణలపై హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కెసిఆర్ డబ్బులు పంపిస్తే… రెండున్నర యేండ్ల నుండి ఎందుకు మాట్లాడలేదని.. ఇన్నాళ్లు నిద్ర పోయావా? అని ఫైర్ అయ్యారు. ఈటెల ప్రస్ట్రెషన్ లో ఉన్నాడని.. పైసలు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈటెల వల్ల..ఊరు కాలదు..పేరు లేవదు అని..అధికారంలో ఉన్నప్పుడే ఈటల మీద పోరాడా ? ఇప్పుడు పోరాడతా అని పేర్కొన్నారు. ఇవాళ అమర వీరుల స్థూపం వద్దకు వెళ్ళిన…