హుజూరాబాద్ పట్టణం లో నీ సాయి రూప గార్డెన్ లో 260 మంది లబ్ధిదారులకు 2,60,30,160 రూపాయల షాది ముబారక్,కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసారు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రపంచం లో, దేశం లో ఎక్కడ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు లేవు. ముఖ్యమంత్రి బడుగు,బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించాడు. రాష్ట్రం లో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ ది. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొంత మంది విమర్శిస్తున్నారు కాబట్టి ప్రజలు అలోచించుకోవలే. కరోనా వచ్చి ఆర్థికంగా ఇన్ని కష్టాల్లో ఉన్న సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అపడం లేదు అని పేర్కొన్నారు.