హుజురాబాద్ గుడ్డి దీపంలా ఉంది : ఈటలపై గంగుల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ మారినప్పటి నుంచి.. ఈటల పై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. ఢిల్లిలో ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని.. ఫ్లైట్ లో వెళ్లి బీజేపీలో చేరిన ఈటలకు బీజేపీ అధ్యక్షులు కూడా టైం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఈరోజు గుడ్డి దీపంలా మారిందని..మన లక్ష సాధన కోసం మనం ఏర్పాటు చేసుకున్న పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఎలక్షన్స్ అయ్యే వరకు హుజురాబాద్ లోనే ఉంటానని కని, విని ఎరుగని విధంగా హుజురాబాద్ ను అభివృద్ధి చేసి చూపెడుతా అని ఈటలకు సవాల్ విసిరారు మంత్రి గంగుల.
హుజురాబాద్ లో అభివృద్ధి జరగలేదు..రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయన్నారు. అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ వద్దకు వెళ్ళని ఈటల.. తన భూములు రెగ్యులర్ కోసం మాత్రమే సీఎం వద్దకు వెళ్ళాడని విమర్శలు చేశారు. మోడీ పాలించిన గుజరాత్ లో కూడా ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదని గుర్తు చేశారు. మన నినాదం అభివృద్ధి నినాదమని.. గంగుల పేర్కొన్నారు. బీజేపీలో చేరే ముందు చట్టసభలో బీసీలకు న్యాయం చేయాలని అడిగి ఉంటె బాగుండేదని చురకలు అంటించారు. టీఆర్ఎస్.. ఢిల్లీ నుండి వచ్చిన పార్టీ కాదని..తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ అని పేర్కొన్నారు.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!