ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ మారినప్పటి నుంచి.. ఈటలపై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బిజెపి నేత పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ నియోజకవర్గం లో అభివృద్ధి జరగలేదని… తాను చేసిన అభివృద్ధి కనబడుతుందని తెలిపారు. ఎన్నికలు ఇప్పుడే రావని.. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. బిజేపిలోకి ఎవరు వచ్చిన స్వాగతిస్తామని… ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. హుజురాబాద్ ను జిల్లా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2014లో పోటీ చేస్తానని వచ్చానని.. అవకాశం రాలేదన్నారు. 2018లో పోటీ చేస్తానని వచ్చాను..అలవెన్స్ లో కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించారు కాబట్టి పోటీ చేయలేకపోయానని పెద్దిరెడ్డి తెలిపారు.