కల చెదిరింది. అనుకున్నది చెయ్యి దాటింది. వాటి గాయాలు మాత్రం మానలేదు. ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఎవరిదారి వారిదే అనుకుంటున్నారో ఏమో కీలక సమావేశానికి డుమ్మా కొట్టేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకీ ఎవరా నాయకులు? హుజురాబాద్ ఉపఎన్నిక సన్నాహక భేటీకి డుమ్మా! ఒకరు మొదట్లో పీసీసీ పదవి వస్తే తీసుకోవాలని అనుకున్నారు. ఇంకొకరు వద్దనుకున్నా.. నువ్వే పీసీసీ చీఫ్.. మేడం ఒకే అనేశారు అని సైలెంట్‌గా ఉన్న నాయకుడిని లేపి…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటల రాజేందరే గెలుస్తాడని తేలిందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్… రెండ్రోజుల తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తానని.. ఎక్కడ ఆపానో అక్కడే ప్రారంభిస్తా.. రెండు రోజులు హుజురాబాద్‌లో అందుబాటులో ఉంటా.. పరిస్థితులు సమీక్షిస్తా.. కార్యకర్తలు, నాయకులను కలుస్తా అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 ఏళ్ల చరిత్రలో సీరియస్ గా పని…
హుజురాబాద్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ లో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా మార్చుకున్నరు కేసీఆర్. మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పార్టీ కి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.. అది నాతో సహా అని తెలిపారు. ఇక ఆగస్టు 9న ఇంద్రవెళ్లిలో దళిత, గిరిజన దండోరా జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు…
హుజూరాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నేతలు, ఇంచార్జులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్ధేశం చేశారు. తాజాగా అక్కడి నేతలతో హరీశ్‌రావు మాట్లాడుతూ… వెక్కిరించిన పనులే వెలుగునిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, కాళేశ్వరం తరహాలోనే దళితబంధు అమలుకూడా జరుగుతుంది అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల్లేవు. ఉద్యోగాలు ఊడగొట్టడమే ఆ పార్టీకి తెలుసు. 1.32లక్షల ఉద్యోగాలు కల్పించిన పార్టీ టీఆర్‌ఎస్. బీజేపీ దొంగ నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు అని తెలిపారు. భారీ మెజార్టీతో…
జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ కొత్త సీపీ సత్యనారాయణ సందర్శించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో ని జమ్మికుంట, హుజురాబాద్ ఇల్లందకుంట ,వీణవంక పోలీస్ స్టేషన్ లను సందర్శించడం జరిగింది ప్రతి మండలంలో లా అండ్ ఆర్డర్ మెంటేన్ చేయడానికి డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. శాంతి భద్రతలను కాపాడటం,ప్రజా శాంతిని భంగం కలిగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం పోలీస్ లుగా మా బాధ్యత అన్ని తెలిపారు. ఇక హుజురాబాద్…
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్ అనే యువకుడితో జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన రేణుక (రేష్మ) అనే యువతికి గత తొమ్మిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. నిన్న జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహాత్య చేసుకున్నారు షబ్బీర్. రేణుక కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.3లక్షలు రూపాయల నగదును అందించారు ఇల్లందకుంట ఇంచార్జ్ లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చొప్పదండి…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించింది తెలంగాణ కేబినెట్. అయితే గత కాలంగా తెలంగాణలో రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెరాస లో చేరారు. దాంతో అక్కడ తెరాస తరపున టికెట్ ఆయనకే ఇస్తారు అనే…
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తాను ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు పూనుకున్నారు.. అయితే, అస్వస్థకు గురైన ఆయన.. ఆస్పత్రిలో చేరారు.. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగిస్తారా? రద్దు చేసుకుంటారా? వాయిదా వేస్తారా? అనే చర్చ మొదలైంది.. వీటికి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. 12 రోజులుగా 222 కిలోమీటర్లకు పైగా ప్రజా దీవెన పాదయాత్ర జరిగిందని.. ఈ యాత్రలో ప్రతిక్షణం నా…
ఎన్నికల్లో హామీలు ఇవ్వడం.. విజయం సాధించిన తర్వాత వాటిని అమలు చేస్తూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం ఎమ్మెల్యేల పని.. ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ నాయకులు చెప్పేవారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందా? అనే చర్చ మొదలైంది.. దానికి ముఖ్య కారణం హుజురాబాద్ ఉప ఎన్నికలే అంటున్నారు.. తాజాగా, యాదాద్రి భువన గిరి జిల్లా ఆలేరు ప్రజలు.. తమ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు చేసిన విజ్ఞప్తి వైరల్‌గా మారిపోయింది.. గొంగిడి సునీతగారికి ఆలేరు…