తెలంగాణ దళితబంధు పథకానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవ సభ జరగనుంది. ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణానికి దళితులు భారీగా తరలివచ్చారు. లక్షా ఇరవై వేల మందికి సిట్టింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. హుజురాబాద్ నియోజకవర్గములోని ప్రతి గ్రామం నుండి ఐదు…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ హుజురాబాద్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును ప్రారంభించనున్నారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటోంది. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.…
రేపు జరుగనున్న ‘దళితబంధు పథకం’ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ వేదిక ముస్తాబైంది. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో వేదికను తయారుచేశారు. వేదికపైకి 15 దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలతో పాటుగా పలువురు ఎంపీలు, మంత్రులు కూర్చోనున్నారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఈ సభ జరుగనుంది. ఇక త్వరలోనే హుజూరాబాద్…
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది దూకుడు పెంచింది. మరోవైపు.. బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది… హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారు అయినట్టు ప్రచారం సాగుతోంది.. ఉప ఎన్నికలో మాజీ మంత్రి కొండా సురేఖను…
కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ… దేశ చరిత్రలు ముఖ్యమంత్రి ఆలోచించని గొప్ప పథకం దళిత బంధు పథకం అని దళిత జాతి ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి విద్యారంగంలో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించి… ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ పథకం హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇక్కడ అమలు జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తారు. కావాలని బీజేపీ…
హుజూరాబాద్ లో ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే.. పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే పలువురు మంత్రులు సైతం నియోజకవర్గంలో పర్యటించి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఇరువురి మాటల తూటాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న భారీ…
తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా ఆ పార్టీలకు పరీక్షే. ఇప్పుడు కొత్తగా మరో పార్టీ ఆ జాబితాలో చేరింది. ఉనికి కోసం క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన పరిస్థితి. ఎన్నికల్లో పోటీ చేస్తాయో లేదో తెలియదు. బరిలో ఉన్నవారికి మద్దతిస్తాయో లేదో కూడా అర్థం కాదు. మొత్తానికి గుంపులో గోవిందగా మారిపోయాయి. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ అంతేనా? హుజురాబాద్‌లో పోటీ చేస్తాయా లేదా? తెలంగాణాలో కొన్నిపార్టీలకు ఎన్నికలంటేనే దడ. ఒక రాజకీయపార్టీగా అలా నడిపించేద్దాం అని అనుకుంటున్న సమయంలో హుజురాబాద్ బైఎలక్షన్…
హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈనెల 16న నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పాలన పరమైన అంశాల్లో కేసీఆర్ వేగం పెంచారు. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ సిద్దిపేట, మెదక్, వరంగల్ జిల్లాలను సందర్శించారు. వాస్తవానికి ఈనెల మొదటి వారంలో నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటనకు వెళ్లాల్సింది ఉంది.…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బందు పథకం లబ్ధిదారుల ఎంపికకు సర్వే పూర్తి అయింది. హుజరాబాద్ నియోజకవర్గం లో ఏ ఒక్కరికి దళిత బంధు పథకం మంజూరు చేయలేదు. ఎలాంటి పుకార్లను నమ్మవద్దు. ఈ నెల 16న హుజురాబాద్ లో దళిత బందు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభము అవుతుంది అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. ప్రతి ఒక్కరికి దళిత బంధు పథకం మంజూరీ చేయబడుతుంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని…
తెలంగాణ ఇప్పుడు హుజురాబాద్ వైపు చూస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల నుంచి బరిలో దిగేది ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఉపఎన్నికలో దళితబంధుదే కీరోల్ అన్నది అధికారపక్షం ఆలోచన. అలాంటి చోట BSP పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? దళితుల మొగ్గు ఎటు? బీఎస్పీ బరిలో ఉంటే ఎర్త్ ఎవరికి? ప్రస్తుతం దీనిపైనే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హుజురాబాద్‌లో బీఎస్పీ పోటీ చేస్తుందా? ఉపఎన్నిక షెడ్యూల్ రాకుండానే హుజురాబాద్ రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో ప్రచారం హోరాహోరీగా…