ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలు టిక్కెటిస్తాం అంటే నాయకులెవరైనా ఎగిరి గంతేస్తారు..కానీ ఈ కాంగ్రెస్ నేత మాత్రం హుజూరాబాద్ లో పోటీకి నో అంటున్నారట. పోటీ చేసేది లేదంటే లేదని తేల్చేశారట. ఈ మాజీ ఎంపీ పోటీచేయనని చెప్పటానికి కారణం ఏంటి? హుజూరాబాద్ అభ్యర్ధి కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వేట మొదలు పెట్టాయి. అధికార పార్టీ ఈ పనిలో వ్యూహరచన చేస్తుంటే, కాంగ్రెస్ ఈ కసరత్తులో కొంత వెనుకబడింది. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధి…
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ… నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు. ఒక్క కరోనా కాలం తప్ప నిరంతరంగా హుజూరాబాద్ ప్రజలతో ఉన్న… 20 ఏళ్లుగా మీతో ఉన్న. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టలమీద పడుకున్న.. మీరంతా నాతో ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉంది. తెలంగాణలో స్వేచ్ఛ గౌరవం లేదు అని తెలిపారు. ఈ…
హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి పై కసరత్తు తుది దశకు చేరిందా? రెండు మూడు రోజుల్లోనే అభ్యర్థి పేరు ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోందా? అభ్యర్థి ఎంపికపై సర్వే రిపోర్థులతో స్పష్టత వచ్చినట్లేనా? హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు కాబోతున్నారు ఎవరెవరు రేసులో హుజురాబాద్ ఉప ఎన్నికను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గం, స్థానికతపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కసరత్తు…
హుజూరాబాద్ ఉప ఎన్నికపై టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే మండలాల వారిగా పార్టీ ఇంచార్జీలను నియమించింది. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు కూడా నియెజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఉప ఎన్నిక షెడ్యులు వచ్చేనాటికి నియెజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై టిఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణులను ఉప ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో ఉన్నారు ముఖ్యనేతలు. ప్రధానంగా నియెజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాలపై…
హుజురాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. టిఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ వర్గీయులగా గొడవలు చోటు చేసుకున్నాయి. కమలాపూర్ మండలం గోపాలపూర్ గ్రామంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు ఈటల అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గోపాల్ పూర్ గ్రామంలో కరెంట్ పోల్స్ కు కట్టిన బిజెపి జెండాలను తొలిగించి… టిఆర్‌ఎస్ జెండాలు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. read also : నేటి నుంచి ఏపీలో…
కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి… ఈటల జమునకు కౌంటర్ ఇచ్చారు. ఈటల జమున బౌన్సలర్లను వెంట పెట్టుకొని గడియారాలు పంపిణీ చేస్తుందని… ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు టీఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు టీఆరెఎస్ పార్టీ, కేసీఆర్ కు అండగా ఉంటారని తెలిపారు. read also : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరో వస్తారు కానీ..…
ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరు. హుజురాబాద్ ఒక్కటే కాదు.. అంతటా ఇలాంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఓపిక, సహనంతో పనిచేయాలి. అధికారంలో ఉన్నా, లేకున్నా ఇక్కడి ప్రజల కోసం ఎంతో పనిచేసాను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉద్యమకాలంలోనూ శక్తివంచన లేకుండా పనిచేసాను ప్రజల్లో బలమున్నవారు చేసే పనులు ఇవి కావు. బలహీనులు…
తెలంగాణలో పాదయాత్ర సీజన్ వచ్చేస్తోంది.. కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారని తెలుస్తుండగా… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్ర తేదీని ప్రకటించారు.. మరోవైపు.. తాజాగా వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల కూడా.. రేపోమాపో పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా చేరారు.. తనపై అభియోగాలు…