దళిత బంధు అమలుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న సర్కార్.. పైలట్ ప్రాజెక్టుగా ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.. ఈ నెల 16వ తేదీ నుంచి హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 16వ తేదీ నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.. ఇక, ఇప్పటికే హుజూరాబాద్…
కరీంనగర్ జిల్లా.. వీణవంక మండల కేంద్రములో దళిత బందు పథకం లబ్ధిదారుల ఎంపికలో అనహార్హులు ఉన్నారని గ్రామస్థుల ఆందోళన చేస్తున్నారు. వీణవంక మండల కేంద్రానికి 35 యూనిట్స్ మంజూరు అయ్యాయి. అందులో కేవలం టీఆర్ఎస్ వాళ్ల పేర్లే రాసుకున్నారని తహశిల్దార్ కార్యలయం ముందు అందోళన చేస్తున్నారు. మండలానికి మొత్తం 351యూనిట్స్ మొదటి విడతలొ వచ్చినట్లు రెవిన్యూ అదికారుల వెల్లడించారు. ప్రతి గ్రామంలో అసలైన లబ్ది దారుల ఎంపిక జరగలేదని వివిధ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.…
నా రాజకీయ గురువు పెద్ది రెడ్డి. ప్రజలకు అన్నం పెట్టె కులం రెడ్డి కులం. రెడ్డి భవనం కోసం ఎకరం భూమి కోటిరూపాయలు మంజూరు చేసినట్లు హుజురాబాద్ జరిగిన సమావేశంలో గంగుల కమలాకర్ అన్నారు. నేను వ్యవసాయ కుటుంబం లో పుట్టిన వాడినే. నీళ్లు లేక పంటలు వెసుకోలేని రోజుల నుండి బీడుభూములు లేకుండ చేసారు కెసిఆర్. గతంలో పంటలు పండక పోవడంతో ఇంటి తలుపులు తీసుకుపోయాయి బ్యాంకులు. తెలంగాణ రాకముందు రాష్ట్రం గుడ్డి దీపంలాగా ఉండేది.…
హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం అందికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికార టీఆర్ఎస్ పార్టీ… విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపింది.. మరోవైపు.. తన నియోజకవర్గమైన హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ పాదయాత్రలు, సభలు, సమావేశాలు జరుగుతున్నా.. ఆయనే అభ్యర్థి అని ఇప్పటి వరకు అధిష్టానం తేల్చింది లేదు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి వేటలో ఉంది.. అయితే, గెల్లు శ్రీనివాస్ యాదవ్.. కేసీఆర్ బానిస అంటూ ఈటల రాజేందర్ కామెంట్ చేయడంపై…
నాకు కేవలం 2 గుంటల భూమే ఆస్తి.. ఓ పని మనిషిలా పని చేస్తా.. అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని హుజురాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్.. స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నాకు టికెట్ ఇచ్చి హుజురాబాద్ ప్రజలకు సేవ చేయమన్న సీఎం కేసీఆర్ కి పాదాభివందనం అన్నారు.. నేను పేద కుటుంబంలో పుట్టిన బిడ్డను.. విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పని చేశాను……
కేసీఆర్ రా.. దమ్ముంటే నాపై పోటీ చేయి.. హరీష్‌రావు రా.. ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలి అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విసిరిన సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. తాజాగా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. హుజూరాబాద్ లో స్వాగతం చూస్తే గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నాడని అర్థమవుతోందన్నారు.. ఎన్నికలు వచ్చినప్పుడు గెలిస్తే ఏం చేయాలో చెప్పాలి.. కానీ, బీజేపీ…
తెలంగాణలోని హుజురాబాద్‌కు త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్నది. ఈటల రాజీనామా తరువాత ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, టీఆర్ఎస్ నుంచి ఎవర్ని నిలబెడుతున్నారన్నది ఇప్పటి వరకు ఆసక్తికరంగా ఉంది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిని పార్టీ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్నుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.…
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు… ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో.. ప్రతీ మంగళవారం దీక్ష చేస్తూ వస్తున్నారు.. అందులో భాగంగా… ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేయనున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హుజురాబాద్ నియోజర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇవాళ దీక్షకు కూర్చోనున్నారు.. సిరిసేడు గ్రామం…
ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా..…
ఉపఎన్నిక వేళ హుజురాబాద్‌లో అధికార పార్టీ నేతలు రహస్య భేటీ ఎందుకు పెట్టుకున్నారు? సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలేంటి? ఓ నేతకు ఇచ్చిన పదవే సీక్రెట్ మీటింగ్‌కు కారణమైందా? టీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! హుజురాబాద్‌లో టీఆర్ఎస్ స్థానిక నేతల రహస్య భేటీ? హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో ఇంకా క్లారిటీ లేదు. అనేక వడపోతలు జరుగుతున్నాయి.. మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య కాంగ్రెస్‌ను వీడీ టీఆర్ఎస్లో చేరిన పాడి…