హుజురాబాద్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ లో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా మార్చుకున్నరు కేసీఆర్. మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పార్టీ కి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.. అది నాతో సహా అని తెలిపారు. ఇక ఆగస్టు 9న ఇంద్రవెళ్లిలో దళిత, గిరిజన దండోరా జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు 5 మండలాలు, 2 మునిసిపాలిటీ లు తీసుకొని ప్రతి రోజు ఒక ప్రాంతంలో 2, 3 వేల మంది తో ర్యాలీ లు, సమావేశాలు జరపాలి. ఇక కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలి అని అన్నారు.