ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా అందులో కులమే కీలకం. అభ్యర్థి ఎంపిక మొదలు గెలుపు వరకు కులందే ప్రధాన భూమిక. నిజం చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నది కుల రాజకీయం. కులాల మీద మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కుల రాజకీయం ఓ రేంజ్‌లో నడుస్తోంది. కులం ఓట్లను పక్కా చేసుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. కులం ఓట్ల కోసం నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు.…
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారం రోజులే మిగిలాయి. దాంతో క్యాంపెయిన్ తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్స్ ఒక్కొక్కరుగా రంగంలో దిగుతున్నారు. అధికార పార్టీ నెల క్రితమే మంత్రి హరీష్ రావును రంగంలో దించింది. మరో రెండు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలను ప్రచారంలోకి దించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కేసీఆర్‌కు ప్రతిష్టకు సవాలుగా మారింది. గెల్లును గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావు…
తెలంగాణకు ఉప ఎన్నిక ఫీవర్ పట్టుకుంది. ఒక నియోజకవర్గం కోసం యావత్ రాష్ట్ర పాలనా యంత్రాంగం హుజూరాబాద్‌ని చుట్టేస్తోంది. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే నెలకొని వుంది. కానీ మధ్యలో కాంగ్రెస్ నేతలు కూడా మేమున్నాం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈటల నిజంగానే ప్రజలకు సేవ చేసి ఉంటే ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అధికార పార్టీకి…
హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. హుజూరాబాద్‌లో కొత్తగా గంజాయి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. దేశ భవిషత్తును పాడుచేసే విధంగా మోడీ పాలన సాగుతోందని, ప్రభుత్వ రంగాలను తక్కువకే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని చాడ మండిపడ్డారు. రైతులను బజారు పాలు చేసే చట్టాలు తెచ్చారు, మోడీ పాలనలో రైతుల బతుకులు దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి హుజూరాబాద్ ఉప ఎన్నికలు బ్రేక్ వేశాయి.. ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ముగిసే వరకు నియోజకవర్గ పరిధిలో దళితబంధు పథకం అమలును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. ఆ పథకం కింద అన్ని దశలలోని నగదు బదిలీ ప్రక్రియను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది ఈసీ.. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన ఆయన..…
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ చేరిందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు మరో పదిరోజుల సమయం ఉండగా ప్రచారం మాత్రం 72గంటల ముందే ముగించాలని ఈసీ ఆదేశించింది. అంటే ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉందనే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా హుజూరాబాద్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా సాగుతున్న ప్రచారంలోకి ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. దీంతో…
హుజూరాబాద్ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటలకు ఇది చావో రేవో ..కాగా కేసీఆర్ ప్రతిష్టకు అతి పెద్ద సవాలు. ఐతే ప్రస్తుతం ఓటరు ఎటు వైపు అన్నదిఎవరికి వారు గెలుపు తమదే అన్న విశ్వాసంతో ఉన్నారు. అయితే ఏం జరుగుతుందో ఈ నెల 30న హుజూరాబాద్ ఓటరు నిర్ణయిస్తాడు. అప్పటి వరకు బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య హోరా హోరీ తప్పదు. హుజూరాబాద్ ప్రజలు పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక్కడ జరుగుతున్నది…
మరోసారి సవాళ్ల పర్వం తెరపైకి వచ్చింది.. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాను చెప్పే అంశాలపై కేటీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.. కేటీఆర్‌తో చర్చకు తానే స్వయంగా వస్తానన్న రేవంత్… అయినా.. తమ పార్టీలో సీనియర్ల గురించి మాట్లాడేందుకు కేటీఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇక, తాము ఏదైనా అంటే కోర్టుకు పోతారని.. అయినా పిరికివాళ్ల గురించి ఏం మాట్లాడుతాం అంటూ రేవంత్ రెడ్డి…
టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ తోడు దొంగలు.. వారివల్లే హుజురాబాద్‌లో దళితబంధు పథకం ఆగిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. దళిత బంధు ఆపడంలో టీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలు.. ఇద్దరి కుమ్మక్కులో భాగమే దళిత బంధు ఆగిపోవడం అని విమర్శించారు.. ఇక, రైతు బంధు అగొద్దని ఎన్నికల కమిషన్ దగ్గర అమలు చేసిన సీఎం కేసీఆర్.. దళిత బంధు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. దళిత బంధు పాత…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి బ్రేక్ పడింది. దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు తెరాస ప్రభుత్వం దళిత బంధు అనే పథకాన్ని తెచ్చి రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ పథకాన్ని హుజురాబాద్ నుండే ప్రారంభించనున్నట్లు తెలిపింది. దాంతో దీని పై చాలా ఫిర్యాదులు…