హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరవుతోంది. ప్రచారానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. పట్టుమని పది రోజులే మిగిలాయి. ఈ లోగా చేయాల్సిందంతా చేసే పనిలో ఉన్నారు నేతలు. ప్రచార ఉధృతి పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దసరా సంబరాలు ముగిశాయి. కానీ హుజూరాబాద్‌లో ఇంకా ముగిసినట్టు లేదు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం దసరాలాగే ఉంది. మరో…
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తీసుకు వస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్లు నా రాజీనామా తరువాతనే… అది కూడ హుజూరాబాద్ మాత్రమే వచ్చాయి. అది మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. పెద్దపల్లి ఎమ్మెల్యేకి టికెట్ నేనే ఇప్పించిన, గెలవడానికి నేనే వెళ్లి ప్రచారం చేసిన. ఇప్పుడు ఆయన కూడా…
తెలంగాణ భవన్ లో కాసేపటి క్రితమే టీఆర్‌ఎస్ పార్టీ కార్యవర్గసమావేశం ముగిసింది. ఈ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగగా.. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామని.. ఈ నెల 27 హుజురాబాద్ లో ప్రచార సభకు తాను వస్తానని ప్రకటించారు. అలాగే… ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ ఉండాలని… మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలన్నారు.…
రాజకీయంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ తీసుకొని గెలుపే లక్ష్యంగా బరిలో దిగాయి. అయితే ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొందనే టాక్ విన్పిస్తోంది. ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా సీన్ మారిపోవడంతో హుజూరాబాద్ లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ సైతం తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆయా పార్టీల తరుఫున కీలక నేతలు…
హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేటలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… నేను మధ్యలో వచ్చి మధ్యలో పోలేదు. సమైక్య పాలనలో ఎన్ని అవమానలు భరించాం. పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఎక్కడ అడిగిన ఈటెల కు కేసీఆర్ ద్రోహం చేసిండు అంటున్నారు. రాజేందర్ గెలిస్తే ఎమ్ వస్తుంది అంటున్నారు. రాజేందర్ గెలిస్తే ప్రగతి భవన్ నుండి బయటికి వస్తాడు. నిరుద్యోగ భృతి వస్థలేదు. అడిగితే నన్ను పార్టీ నుండి బయటికి పంపాడు. వందల కోట్లు నా మీద నన్ను…
కరీంనగర్ జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా సాగాయి. దసరా చివరి రోజు కారణంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. రెండు రోజుల వ్యవధిలో జిల్లాలో 23 కోట్ల 20 లక్షల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దసరా ఫెస్టివల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజక వర్గంలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం అమ్మకాలు 53 శాతం పెరిగనట్టు అధికారులు చెబుతున్నారు. వైన్ షాపుల వద్ద విపరీతమైన…
ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్…
తెలంగాణలోని హుజూరాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా ప్రచారంలో దూసుకెళుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాతీయ పార్టీలని చెప్పుకునే సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ రెండు పార్టీల దుస్థితి చూస్తుంటే తెలంగాణలో ఈ పార్టీల భవిష్యత్ ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి.…
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… ఎక్కడి వాడో వచ్చి మన ఊర్లలో మన బొడ్రాయి దగ్గర ఈటల రాజేందర్ ఒక్క రూపాయి అభివృద్ధి చెయ్యలేదు అని అంటున్నారు. బ్రోకర్ గాళ్ళు, పని చేయని వారు వచ్చి మాట్లాడుతుంటే మీరు కూడా విని ఊరుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్నారు. ఈ ఊరికి రోడ్డు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందే వేయించిన. చిన్న ఊరి వారికి కూడా పెద్ద బ్రిడ్జి…
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే యావత్ తెలంగాణ ప్రజల దృష్టి నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఇప్పటికే ఓసారి సర్వే నిర్వహించిన అధికార పార్టీ మరోసారి సర్వే చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ ఆదేశాలతో సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలు మరోసారి రంగంలోకి దిగి రీ సర్వే చేపడుతున్నాయి. ఈ…