ప్రధాన పార్టీ అభ్యర్థులను ఎన్నికల గుర్తులు టెన్షన్ పెడుతున్నాయా? హుజురాబాద్‌లోనూ ఆ కథ పునరావృతం అవుతుందా? ఏ సింబల్స్‌పై కలవరం నెలకొంది? గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నదేంటి? చపాతీ రోలర్.. రోడ్డు రోలర్ గుర్తులతో టెన్షన్..! ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచినా.. గెలుపు గెలుపే. ఓడిన అభ్యర్థి కంటే.. ఆ అభ్యర్థికి పడాల్సిన ఓట్లను కొల్లగొట్టినవారే ఎక్కువగా చర్చల్లోకి వస్తారు. అది కొన్నిసార్లు రెబల్స్‌వల్ల నష్టం చేకూరొచ్చు.. మరికొన్నిసార్లు గుర్తుల వల్ల కావొచ్చు. 2019 లోక్‌సభ, గత…
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ పోటా పోటీగా క్యాంపెయిన్‌లో దూసుకుపోతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలను మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో సీనియర్ నేత బి.వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు గెల్లు గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని చాలా రోజులుగా అధికార పార్టీ హుజూరాబాద్‌లో పావులు కదుపుతోంది. ముఖ్యంగా…
హుజూరాబాద్‌లో గెలవటం ఎలా? ఏం చేస్తే గెలుస్తాం? ఒకటి డబ్బు ..రెండు హామీలు. కుల సమీకరణలు ఎలాగూ ఉంటాయి. కానీ వాటికి కూడా ఈ రెండే అవసరం. అధికార పార్టీ ఈరెండింటినే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. జోరుగా హామీల వర్షం కురిపిస్తోంది. గులాబీ పార్టీ వారు ఓటుకు పది వేలు ఇస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీజేపీ కూడా బాగానే ముట్టచెపుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన బై…
ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలుగు వారినే కాదు ఢిల్లీని కూడా ఆకర్షిస్తోంది. ఈ హైవోల్టేజీ ఎన్నికను టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అనే కంటే కేసీఆర్ వర్సెస్ ఈటల అంటే బాగుంటుందేమో. నిజానికి హుజూరాబాద్ ప్రజలు అలాగే పరగణిస్తున్నారు. పైగా ఈ ఉప పోరును ఒకరిపై ఒకరికి ద్వేషంతో చేస్తున్న పోరుగా చూస్తున్నారు. ఎలా మొదలైందో కానీ.. మొత్తానికి ఆట మొదలైంది. అయితే ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఇప్పటికి ఇప్పుడు చెప్పటం…
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా.. హుజురాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ , ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంతలో కూరగాయలు…
ఈనెల 30 వ తేదీన జగరబోతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం పెద్ద ఎత్తున బందోస్తును ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేస్తున్న బందోబస్తు మరింత ఎక్కువగా ఉన్నది. 1900 మంది బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్లూకోట్స్, పెట్రో కారులతో పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘాను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హుజురాబాద్ పరిధిలోని…
హుజురాబాద్‌కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తున్నది. హరీష్‌రావు అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అయితే, ఇటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి లోకల్‌లో బీజేపీ నాయకులు ప్రచారం…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్నది. ఈరోజు సాయంత్రం గుర్తులను కేటాయించనున్నారు. ప్రస్తుతానికి బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ఎంతమంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఉన్నది. పోటీనుంచి తప్పుకునే వారు నేరుగా సంతకం పెట్టి నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, 32 మంది…
మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి…
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక తేదీ తరుముకొస్తున్న నేపథ్యం లో… నేతల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. అయితే.. తాజాగా హన్మకొండ జిల్లా పెంచికలపేట సభలో ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు మంత్రి హరీష్ రావు. గ్యాస్ సిలిండర్ ధర లో 291 రూపాయలు రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు మంత్రి హరీష్ రావు. 291…