హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తరువాత అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్ కి బయలుదేరిన బస్ లు మార్గం మధ్యలో ఒక టీఆర్‌ఎస్ నాయకుడి హోటల్ ముందు ఎలా ఆపుతారని ప్రశ్నించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ. బస్ రిపేర్ అయ్యిందని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్టు వీడియోలను చూసామని, వీవీ ప్యాట్ బయటికి ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పూర్తి భద్రత తో ఈవీఎంలు తరలించాలి. కానీ పోలీస్ లు లేకుండా ఎలా ఈవీఎంలను తీసుకు వెళుతారు? ఎలాంటి భద్రత లేకుండా ఆ బస్ లను అక్కడ ఎందుకు నిలిపి వేశారని అరుణ ప్రశ్నించారు.
హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని అన్ని సర్వేలలో ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఈవీఎం బాక్స్ లను మార్చాలని చూసారన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అధికార పార్టీ టీఆర్‌ఎస్ చేయని ప్రయత్నం లేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు 75 కోట్ల మద్యం తాగించారని ఆమె మండిపడ్డారు.
ఏడేళ్ళ పాలనలో దళితులకు ఏమి చేయని ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు పథకం ను తీసుకువచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఒక్క ఓటుకు ఆరువేల రూపాయలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ కంటెయినర్ లో హైదరాబాద్ నుండి హుజురాబాద్ కు డబ్బులు పంపించి హుజురాబాద్ లో పంచారన్నారు.
హుజురాబాద్ పోలింగ్ ముందు మనిషికి ఆరువేలు.. ఓటు వేసే రోజు మళ్ళీ 10వేలు పంచారు. ఇన్నేళ్ళ పాలనలో కేసీఆర్ అభివృద్ధి చేసి ఉంటే పైసలు ఎందుకు పంచాడని డీకె అరుణ ప్రశ్నించారు. డబ్బుతో ఎన్నికలలో గెలవాలని కేసీఆర్ చూస్తున్నాడని, కుక్కను నిలబెట్టిన గెలుస్తారని ముందు నుంచి కేసీఆర్ చెప్పారు. అధికారులు టీఆర్‌ఎస్ నేతల చెప్పు చేతుల్లో నడిచారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పై సీబీఐ విచారణ చేపట్టాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. పని చేయని వీవీ ప్యాట్ కారులోకి ఎలా వెళుతుంది.స్ట్రాంగ్ రూమ్ లోనే ఉండాలి కదా అన్నారు అరుణ.