5 నెలల ఉత్కంఠకు తెరపడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి పోస్టల్ బ్యాలెట్‌లో ఉన్న 753 ఓట్లను లెక్కించి టీఆర్‌ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తం 22 రౌండ్లలో హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముందుగా హుజురాబాద్ ఓట్లను లెక్కించనున్నారు.