Wife Kills Husband: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన ఈ ఘటన సిద్దవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. అయితే, రాయచోటి ఘాటులో పూర్తిగా పురుగులు పడిన గంగయ్య మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో ఎంజాయ్ చేద్దామనుకుంది భార్య. అందుకోసం అతన్ని ఇంటికి పిలిపించుకుంది. కానీ.. కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఈ ఘటన యూపీలోని మహారాజ్‌గంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరు కావడం కోసం వెళ్ళాడు. ఈ క్రమంలో.. భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.
Private Part Cut: ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే వేధింపులకు విసుగు చెందిన అతని రెండో భార్య భర్త మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ భర్తని ఒంగోలు నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..…
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ భర్త తన భార్యను చంపించాడు. ఈ హత్యలో యువకుడి స్నేహితుడు కూడా అతనికి సహకరించాడు. భార్యను హత్య చేసేందుకు భర్త రూ.2.5 లక్షలకు బేరం కుదుర్చుకుని కళ్ల ముందే భార్యను స్నేహితుడి చేతిలో హత్య చేయించినట్లు సమాచారం.
శ్రీవారి మెట్టు మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.. పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ.. ఓ యువకుడి ప్రేమలో పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్రేమ అంటూ వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుందామని ప్రమోజల్ పెట్టాడు.. ఆ ప్రేమ నిజమేనని నమ్మిన ఆమె.. ప్రియుడినే పెళ్లి చేసుకుంది.. కొంత కాలం అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత మరో మహిళతో ఉండసాగాడో వ్యక్తి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని.. మహిళా కానిస్టేబుల్‌తో విడిగా కాపురం పెట్టాడు.. ఇది పసిగట్టిన భార్య.. ఆ ఇంటి ముందు తిష్టవేసి.. భర్త బండారాన్ని బయటపెట్టింది.. రెడ్ హ్యాండెడ్‌గా పెట్టుకుని.. పోలీసులకు అప్పగించింది.. ఈ ఘటన విజయనగరం జిల్లాలో…
యూపీ రాజధాని లక్నోలో ఓ వ్యాపారి తన రెండో భార్యను కలిసేందేకు వచ్చి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారవేత్త సతీష్ సోని పట్టపగలే కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓ సిగ్నల్ వద్ద గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమెపాలిట కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. భార్యను చంపడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్‌పై పడేశాడు ఆ దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని దూళ్లవానిగూడెంలో చోటుచేసుకుంది.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధంతో భర్త బలయ్యాడు. మృతుడు విశాఖలోని ఓ ప్రయివేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కట్టుకున్న భార్య, నమ్మిన స్నేహితుడు మోసం చేయడం తట్టుకోలేక హరి ప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.