అవయవ దానం చేయడం మంచిదే. అది ఎప్పుడు చేయాలి.. కోమాలో ఉన్నప్పుడో.. లేదంటే చనిపోయాక చేయడం మంచిదే. అంతేకాని చిన్న వయసులో.. పసి బిడ్డలు కలిగిన వారు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
అనుమానం పిచ్చితో భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. భర్త నర్సింహులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో గ్యాస్ డెలివరి బాయ్ గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం చిట్కుల్ గ్రామనికి చెందిన ఇందిరతో నర్సింహులుకి వివాహం అయింది. అయితే.. 13 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న జీవితంలో అనుమానం అనే ఓ దెయ్యం వచ్చి ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని స్వస్థలం ఆందోల్ కి తీసుకువచ్చాడు నిందితుడు.…
పసుపు పారాణి ఆరకముందే.. ఓ నవ వధువు దారుణ హత్యకు గురైనట్టు కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. భర్త తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. నవ వధువు గొంతు నులిమి, చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి చనిపోయిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.. హైదరాబాద్ జరిగిన ఈ ఘటనపై అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై చర్యలు…
మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ను భర్త థామస్నే చంపినట్లుగా న్యాయస్థానం తేల్చింది. ఆత్మ రక్షణ కోసమే ఈ హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. హత్య తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఆత్మ రక్షణ దేని కోసమో క్లారిటీ రాలేదు.
వయనాడ్లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో…
భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఉదంతం ఫ్రాన్స్ నుంచి వెలుగులోకి వచ్చింది. ఇది విన్న తర్వాత మీరు కూడా మానవ నాగరికత ఎటువైపు పయనిస్తుందో ఆలోచించవలసి వస్తుంది.
యూపీలోని బల్రామ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. నిందితుడు భర్త హత్యకు ముందు హాలీవుడ్ క్రైం సినిమాను చూసి భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా.. ఆమె శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి, ఆ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరిగింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వారి బంధం ఎంతో అనోత్యంగా సాగింది.. వారి దాంపత్య జీవితంతో ఓ కూతురు కూడా పుట్టింది.. కానీ, విధి చాలా విచిత్రమైనది.. ఆ ఇల్లులను దూరం చేసింది.. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక.. జీవచ్ఛవంలా మారిన ఆ భర్త.. తన భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేయించి తన ప్రేమను చాటుకున్నాడు.
భర్తను హత్య చేసిన ఘటనలో పార్వతీపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యతో సహా హత్యకు సహకరించిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ క్రమంలో.. ఈ కేసుకు సంబంధించి తీర్పు ఈరోజు వెలువడింది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పాత ఊరిలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. భార్యపై అనుమానంతో తలపై డంపుల్స్ తో కొట్టి హతమార్చాడు. నిందితుడు తుపాకుల సాయిగా గుర్తించారు. కాగా.. మృతురాలు తుపాకుల అరుణకుమారి. అయితే.. వీరి స్వస్థలం బొబ్బిలి. పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అనపర్తి వచ్చి బతుకుతున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం కూడా ఉంది. కాగా.. తన తల్లి మరణంతో పిల్లలు తీవ్రంగా రోధిస్తున్నారు.