ఐదు అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్నారు మంత్రి నారాయణ.. ఆన్‌లైన్‌లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు.. లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు..
Cement Prices: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి చేదువార్త. కొన్ని నెలల ఉపశమనం తర్వాత సిమెంట్ ధరలు మరోసారి పెరగడం ప్రారంభించాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో సిమెంట్ ధరలో గణనీయమైన పెరుగుదల కనిపించింది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రికి హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఇల్లు వుంది. అలాగే ఇప్పుడు కుప్పంలోనూ మరో ఇల్లు నిర్మించేందుకు అంతా సిద్ధం అయింది. కుప్పంలో ఇంటి నిర్మాణం కోసం ఇంతకుముందే భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు. ఇవాళ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని 1.99 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ మనోహర్ పేర్లమీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు.…
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పనులను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… కడప జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డిగారిపల్లెలో వైస్సార్ జగనన్న కాలనీని సందర్శించిన ఆయన.. ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు.. వాటితో పాటు త్వరితగతిన ఇసుక డంప్ ను ఏర్పాటు చేయాలన్న ఆయన.. యుద్ధప్రాతిపదికన…