రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు, నోటీసు వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. విచారణ సందర్భంగా ఉద్వేగానికిలోనైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు.. 13వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు… అయితే, ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో…
తమిళ కథానాయకుడు శింబు నటించిన తాజా చిత్రం ‘మానాడు’ నవంబర్ 25న విడుదలై, చక్కని ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈ యంగ్ హీరో అనారోగ్యంతో ప్రస్తుతం చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. దాంతో అతనికి కరోనా సోకిందనే ప్రచారం సోషల్ మీడియాలో విశేషంగా జరగడం మొదలైంది. గొంతు నొప్పితో శింబు హాస్పిటల్ లో చేరాడని, అతనికి కరోనా రాలేదని సన్నిహితులు స్పష్టం చేశారు. శింబు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…
నవంబర్ 22న కరోనా సోకి శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ శనివారం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తూ, తాను త్వరగా కోలుకోవాలని మనసారా ఆకాంక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కు, ఇతర రాజకీయ నాయకులకు, అలానే ప్రముఖ నటుడు రజనీకాంత్ తో పాటు చిత్రసీమకు చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తనకు…
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో.. వెంటనే ఆయనను చికిత్స కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు.. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు బిశ్వభూషన్.. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది.. అయితే, ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఏంటి..? ప్రస్తుతం ఎలా ఉన్నారు.. ఏ చికిత్స జరుగుతోంది..? లాంటి విషయాలు మాత్రం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాతే తెలియనున్నాయి. ఆయన…
గత పది రోజులుగా వెర్టిగో తో బాధపడుతున్నాడు జస్వంత్. అయితే పంటి బిగువున బాధను భరిస్తూనే, కొన్ని టాస్క్ లలో పాల్గొంటున్నాడు. ఇతర ఇంటి సభ్యుల సహకారంతో రోజులు నెట్టుకొస్తున్నాడు. వారం రోజులు దాటిపోయినా జెస్సీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో నిన్న ప్రసారం చేసిన ఎపిసోడ్ లో ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ ను కూడా వీక్షకులకు బిగ్ బాస్ టీమ్ చూపించింది. అయితే.. ఇవాళ జెస్సీని బిగ్ బాస్ అనారోగ్య కారణంగా ఇంటి నుండి బయటకు…
మనిషికి నీరు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారం లేకుండా కొన్నిరోజులు జీవించవచ్చు. కానీ, నీరు లేకుండా ఎక్కవ సమయం జీవించలేవు. దట్టమైన మంచు ప్రాంతాల్లో నివశించినా, ఎడారి ప్రాంతాల్లో నివశిస్తున్నా దాహంవేసినపుడు తప్పనిసరిగా నీరు తీసుకోవాల్సిందే. మంచీనీళ్ల కోసం మనిషి చాలా డబ్బులు ఖర్చుచేస్తుంటారు. ఇలాంటి మంచినీటిని గత 30 ఏళ్లుగా అక్కడ టాయిలెట్లకోసం వినియోగిస్తున్నారట. ఈ విషయం ఇటీవలే బయటపడింది. జపాన్‌లోని ఒకాసా విశ్వవిద్యాలయంలోని ఆసుపత్రిలో టాయిలెట్ల కోసం మామూలు వాటర్‌కు బదులుగా…
నిర్మల్ జిల్లాలో సర్కారీ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. భైంసా ఏరియా ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కుభీర్ మండలం బెల్లామ్ తండా కు చెందిన రేఖ అనే మహిళ ఆదివారం ఆస్పత్రికి వచ్చింది. ఆమె మధ్యాహ్నం 3 గంటలకు డెలివరీకి రాగా అర్ధ రాత్రి నార్మల్ డెలివరీ అయింది. అనంతరం డాక్టర్లు, సిబ్బంది వెళ్ళిపోయారు. మగ బిడ్డ కు జన్మ నిచ్చిన రేఖ అనారోగ్యంతో కన్నుమూసింది.…
ప్రపంచాన్ని శాసించే పదునైన ఆయుధం.. డబ్బు. అందరు ఈ డబ్బు కోసమే పరితపిస్తుంటారు. ఇంకొంతమంది డబ్బు కోసం కక్కుర్తి పడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. కేవలం ఒక వంద రూపాయల కోసం కక్కుర్తిపడి ఒక వార్డు బాయ్ చేసిన నిర్వాకం ఒక చిన్నారి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా ఊపిరితిత్తులలో సమస్యతో బాధపడుతున్నాడు. ఈ…
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కేవలం వంద రూపాయల కోసం వార్డుబాయ్ ఘోరానికి ఒడిగట్టాడు. అతడి బాలుడి ప్రాణం తీశాడు వార్డ్ బాయ్. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల క్రితం నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించాలన్నారు. బాలుడికి ఆక్సిజన్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అక్కడే మరో రోగి చికిత్స అందుకుంటున్నాడు.…
మనం జీవితంలో అనేక వార్తలు చదువుతుంటాం. కానీ కొన్ని వార్తలు మనలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని భయాందోళనలకు గురయ్యేలా చేస్తాయి. ఈమధ్యే ఈజిప్టులో ఓ ఆస్పత్రిలో జరిగిన సంఘటన అవాక్కయ్యేలా చేసింది. చిన్నప్పుడు మనం ఆడుకుంటూ.. బలపం, చిన్న చిన్న వస్తువులు మింగేసి ఉంటాం. ఆ తర్వాత వాటిని వైద్యులు నానా కష్టాలు పడి తీసేవారు. కానీ ఓ రోగికి ఏమైందో తెలీదు గానీ ఏకంగా ఓ మొబైల్ ఫోన్ మింగేశాడు. తర్వాత అతను కడుపునొప్పితో నానా…