గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన మూడు రోజుల శిశుశు ఆచూకీ లభ్యమైంది.. బాలుడిని స్వాధీనం చేసుకున్న కొత్తపేట పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించిన నిందితులే.. బాలుడిని అపహరించినట్టు నిర్ధారణకు వచ్చిన కొత్తపేట పోలీసులు.. రంగంలోకి దిగి వారిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.. నిందితులు హేమవరుణ్, పద్మలు నెహ్రునగర్ కు చెందిన వారిగా గుర్తించారు.. హేమవరుణ్ గతంలో జీజీహెచ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశారని చెబుతున్నారు.. ఇక, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన…
తిరుపతి అంకుర ఆసుపత్రిలో అరుదైన చికిత్స అందించారు వైద్యులు. కాటుక డబ్బా మింగేసిన ఓ 9 నెలల బాలుడిని కాపాడారు వైద్యులు. బాలుడు నెల్లూరు జిల్లా డక్కలి మండలం ఎంబులూరు వాసి. ఆడుకుంటూ కాటుక డబ్బా రోహిత్ మింగేయడంతో అతని స్వరపేటికలో ఇరుక్కుపోయింది కాటుక డబ్బా. అయితే ల్యారింగో స్కోపి ద్వారా కాటుక డబ్బా ను బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు అంకుర ఆసుపత్రి వైద్యులు. ఈ చికిత్స విధానాన్ని మీడియాకు వెల్లడించిన అంకుర ఆసుపత్రి…
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు, ఆసుపత్రి బృందం చెబుతున్న ఫ్యాన్స్ కాస్త నిరాశే వ్యక్తం చేశారు. కనీసం ఓ ఫోటోనైన షేర్ చేయొచ్చుగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా దీనిపైనా సాయిధరమ్ తేజనే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘నాపై మరియు నా చిత్రం “రిపబ్లిక్” పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం’ అంటూ సాయిధరమ్ తేజ్ తన చేతి సంజ్ఞతో కోలుకున్నాను అనే…
మహిళలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించేలా చేస్తున్నారు కామాంధులు.. దేశవ్యాప్తంగా ఏదోఒక చోట వరుసగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా నిజామాబాద్‌లో దళిత యువతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు నలుగురు యువకులు.. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుండగా.. ఇక, బర్త్ డే పార్టీ ఉందంటూ.. యువతిని ఆహ్వానించాడు ఆ కామాంధుడు.. దీంతో.. ఆర్మూర్ నుంచి…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. ప్రస్తుతం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుంటున్నారు పుష్ప శ్రీవారి… విజయవాడ నుండి విజయనగరం వెళ్తుండగా.. ఆమె స్వల్ప అస్వస్థతకు గురైనట్టు అనుచరులు చెబుతున్నారు.. అయితే, పుష్ప శ్రీవాణి అస్వస్థతకు గురైన కారణాలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం…
ఆరోగ్యం బాగుపడిన డిశ్చార్జ్ చేయకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఆసుపత్రిలోనే ఉంచి యాజమాన్యం బెదిరించిన ఘటన ఎల్బీనగర్ లోని నక్షత్ర ఆస్పత్రిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. ‘ నేను బాగానే ఉన్నాను.. ఆరోగ్యం కుదుటపడింది.. ఇంటికి వెళ్తాను, దయచేసి డిశ్చార్జ్ చేయండని పేషంట్ మొత్తుకుంటున్నా కూడా ఆస్పత్రిలోనే డాక్టర్లు బలవంతంగా ఉంచారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం.. నీకు సీరీయస్ గా ఉంది, మేము చేప్పే వరకు నువ్వు ఆస్పత్రిలోనే ఉండాలంటూ ఆస్పత్రి యాజమాన్యం బెదిరించింది. జ్వరంతో వచ్చిన…
ఉత్తరప్రదేశ్‌లో 1991లో ఈపీసీఈ అనే ఆసుపత్రిని నిర్మించారు. అందులో రోగుల కోసం లిప్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, 1997 వరకు వినియోగించిన లిఫ్ట్‌ను కొన్ని కారణాల వలన వినియోగించకుండా వదిలేశారు. ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే, తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇటీవలే అధికారులు ఈ లిఫ్ట్‌ను ఓపెన్ చేయగా అందులో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. లిఫ్ట్‌లో ఓ మనిషికి సంబందించిన అస్తిపంజరం కనిపిచింది. దానిని చూసిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.…
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమా షూటింగ్ లో గాయపడి మూడు రోజులు అవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయింది. ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోజే డిశార్చ్ అయ్యారు. అయితే గాయ పరిస్థితిపై తిరిగి మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయనను చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే అభిషేక్…
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కష్ట సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనాను క్యాష్ చేసుకుంటున్నాయి. భారీ ఫీజులు వసూల్ చేస్తున్నాయి. అయితే అలాంటి ఆసుపత్రులకు ఏపీలో భారీగా జారినామాలు విధిస్తున్నారు అధికారులు. ఊక తాజాగా నెల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రులకు భారీ జరిమానా విధించారు అధికారులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని రోగులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి 13.50 లక్షల జరిమానా విధించారు జాయింట్ కలెక్టర్. నెల్లూరులోని నారాయణ, కిమ్స్,…
ప్రభుత్వాసుపత్రి శిథిలావస్థకు చేరుకోవటంతో ఆ మండలంలోని గ్రామాలు ఆందోళన చెందుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం, కుందారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవలే కురిసిన వర్షాలకు కూలిపోయే దశలో వుంది. దీని మరమ్మతులకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆసుపత్రిలోనే కరోనా పేషేంట్లకు చికిత్సలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. భవనంపై నుంచి మట్టి రాలుతుండటంతో ఎప్పుడు కూలిపోతుందోమోననే భయంతో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో…