దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ బౌండరీ లైన్ దగ్గర మరో ఆటగాడు మహమ్మద్ హస్‌నెయిన్‌ను గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. పాకిస్థాన్ సూపర్‌లీగ్ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హసనెయిన్ మోకాలు డు ప్లెసిస్ తలకి బలంగా తాకడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అందరు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆసుపత్రిలో ఆయనకు స్కానింగ్ తీసిన…
రుయా ఆస్పత్రిలో నర్సులు ఆందోళన చేస్తున్నారు. నర్సుపై సూపరింటెండెంట్ విచారణ వేయడంపై ఈ నిరసన చేస్తున్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వినియోగంలో నర్సుపై ఆరోపణలు వేశారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేసారు. ఆరోపణలపై విచారణ చేస్తున్నారు రుయా సూపరింటెండెంట్ భారతి. అయితే ఈ సూపరింటెండెంట్ వైఖరిని నిరసిస్తూ నర్సులు ఆందోళన చేపట్టారు. అయితే నర్సులపై వేధింపులు మానుకోవాలని సూపరింటెండెంట్ కు వినతిపత్రం అందించారు.
నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్నతస్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. తన కామ వాంఛ తీర్చాలంటూ మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. కారులో ఒంటరిగా రావాలని, తనతో ఒంటరిగా గడపాలని.. బెదిరింపులకు దిగుతారట.. ఓ హౌజ్ సర్జన్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.. నా రూమ్ లో ఏసీ ఉంది వచ్చేయ్ అని అంటావా..? రాకపోతే కాళ్లూ చేతులూ కట్టేసి నోటికి ప్లాస్టర్…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు వచ్చాయి.. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికొత్స పొందుతున్న తమ్మినేని.. అయితే, తమ్మినేని ఆరోగ్యపరిస్థితిపై ఆయన కుమారు చిరంజీవి నాగ్ తాజాగా ఓ ప్రకటన చేశారు.. నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు.. డీ హైడ్రేషన్ కు గురైనందున జ్వరం వచ్చిందని.. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నందున ముందస్తు జాగ్రత్త కోసమే ఆసుపత్రిలో చేర్చినట్టు విరించారు.. ప్రస్తుతం నాన్నగారి రిపోర్టులన్నీ నార్మల్…
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో ఓ యువకుడు బలయ్యాడు. యాక్సిడెంట్ లో మతిస్థిమితం కోల్పోయిన యువకుడిని మూడు రోజులపాటు గదిలో పడేసారు సిబ్బంది. అక్కడ ట్రీట్మెంట్ లేక తాగడానికి నీళ్లు లేక ప్రాణాలు కోల్పోయాడు పులి కిరణ్. గత బుధవారం వరదయ్యపాలెం వద్ద ద్విచక్ర వాహనంలో వేళుతుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పులి కిరణ్… వైద్యం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా అస్పత్రికి తరలించారు వరదయ్యపాలెం పోలీసులు. ప్రమాదం తర్వాత మతి తప్పిన యువకుడు ఆస్పత్రి వద్ద…
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 67 మంది సిబ్బంది భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ పై సిబ్బంది పని చేస్తున్నారు. ఏప్రిల్ 30 తో గడువు ముగిసిన ఇప్పటివరకు కొనసాగింపు ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వం నుండి రెన్యువల్ ఉత్తర్వులు వస్తేనే జీజీహెచ్ లో విధులు నిర్వహిస్తాం అంటున్నారు. రెన్యువల్ చేయకుంటే మే నెల వేతనం కూడా రాదంటున్నాయి ఆసుపత్రి వర్గాలు. సిబ్బంది రెన్యువల్ పై కలెక్టర్, డిఎంఈ కి విన్నవించామంటున్న ఆసుపత్రి వర్గాలు… సిబ్బంది…
వరంగల్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు సామాన్యులు విలవిలాడుతున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గర నుండి డబ్బులు దండుకుంటూ రోగులు, వారి బంధువులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరంగల్ జిల్లాలో మొత్తం. 11 హాస్పిటల్స్ కి నోటీసు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 5 హాస్పిటల్స్ కి రాష్ట్ర స్థాయి నుండి 6 హాస్పత్రులను నోటీసులు జారీ చేశారు. ఒక్కరోజుకు 30 వేల నుండి 50 వేలు చార్జీ…
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇవాళ తన నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. మాల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని 50 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి చికిత్స అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్‌సీని దతత్త తీసుకున్న రేవంత్ రెడ్డి…నియోజకవర్గ ప్రజలకు కోరనా చికిత్స…
విద్యుత్ సరఫరాలో అంతరాయం కరోనా రోగుల ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం సృష్టిస్తోంది.. మహమ్మారి కట్టడి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను పూనుకుంటోంది.. బెడ్ల కొరత, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. అయినా.. క్రమంగా అక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మృతుల సంఖ్య కూడా కలవరపెడుతోంది.. తాజాగా, గోరఖ్‌పూర్‌లోని ఆరుహి ఆస్పత్రి అండ్ ట్రామా సెంటర్‌లో చికిత్స సమయంలో వెంటిలేటర్‌పై ఇద్దరు కోవిడ్ రోగులు మృతిచెందారు.. ఈ ఘటనను సీరియస్‌గా…
గోవాలో కరోనా మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రి లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ మెడికల్ కాలేజీలో కొన్ని రోజులుగా ఆక్సిజన్ కొరత కారణంగా తాజాగా 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మొత్తం 83 మంది మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడంతో అధికారులు ఈ ఆసుపత్రిపై దృష్టి సారించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగకుండా…