Supreme Court: రైతుల డిమాండ్ల సాధనకై రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ గత 36 రోజులుగా అమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండటంతో తగిన వైద్య సహాయం అందించాలని డిసెంబర్ 20న సుప్రీంకోర్టు పంజాబ్ సర్కార్ కి ఆదేశాలు జారీ చేసింది. దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించడానికి తమకు మరింత సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో.. దానికి ఒప్పుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది.
అయితే, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో నవంబర్ 26 నుంచి జగ్జీత్‌సింగ్ దల్లేవాల్ పంజాబ్- హర్యానా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం దగ్గర దీక్ష చేపట్టారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తక్షణమే వైద్య సహాయం అందించాలని అత్యున్నత న్యాయస్థానం అక్కడి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. కానీ, దల్లేవాల్‌కు వైద్యం అందించడానికి వెళ్తే రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయి.. కనీసం ఐవీ ఫ్లూయిడ్స్‌నైనా ఇవ్వడానికి అవకాశం రావడం లేదని సుప్రీంకోర్టు ముందు పంజాబ్ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది.
Read Also: హాట్ అందాలతో అదరగొట్టిన నేషనల్ క్రష్!
కాగా, బలవంతంగా తరలిస్తే ఇరువైపులా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టులో పంజాబ్ సర్కార్ తేల్చి చెప్పింది. దీనికోసం మరింత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని అడగటంతో.. ప్రభుత్వం విన్నపం మేరకు కోర్టు మరో మూడు రోజుల గడువు ఇచ్చిందని పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ వెల్లడించారు. నిరసన తెలియజేస్తున్న రైతులతో అధికారులు చర్చలు కొనసాగిస్తున్నారు.. దల్లేవాల్‌ను సమీపంలోని తాత్కాలిక ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.