ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. మంత్రి రవి కుమార్.. చిలకలూరిపేటలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఒంగోలు వెళ్తున్నారు.. ఒంగోలులో జరిగే జెడ్పీ సమావేశానికి మంత్రి గొట్టిపాటి వెళ్తున్న సమయంలో త్రోవగుంట ఫ్లై ఓవర్ పై ఓ ప్రమాదం జరిగింది.
ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తన చేతి మణికట్టు కోసుకుని దాన్ని వీడియో తీసి ప్రేమికుడికి పంపించింది. ఆ యువకుడు ఆస్పత్రికి పరిగెత్తగా.. ప్రియురాలి పరిస్థితి చూసి స్పృహతప్పి పడిపోయాడు.
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిన్న (బుధవారం) కిడ్నాప్ అయిన శిశువు సేఫ్‌గా ఉంది. హైదరాబాద్‌లో చిన్నారి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ల నుంచి పాపని రక్షించి పోలీసులు సంగారెడ్డికి తీసుకువచ్చారు. కాగా.. శిశువు కిడ్నాప్ అయిన 30 గంటల్లోనే కేసును సంగారెడ్డి పోలీసులు ఛేదించారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రోజు అర్థరాత్రి అస్వస్థతకు గురుకావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. స్వల్ప గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్టుగా చెబుతున్నారు.. అయితే, గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్టుగా పేర్కొన్నారు రాధా సన్నిహితులు
Jharkhand : జార్ఖండ్‌లోని పాలములో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో 25 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ సందర్భంగా స్పృహతప్పి పడిపోయారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.
Monkeypox: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డును వైద్య అధికారులు ఏర్పాటు చేశారు.
శ్రీవారి మెట్టు మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.. పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ.. ఓ యువకుడి ప్రేమలో పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Doctors Negligence: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అశ్విని అనే మహిళ కుర్చీలోనే డెలివరీ అయింది. ఈరోజు తెల్లవారు జామున ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించింది.