Honour killing: తమిళ నటుడు-దర్శకుడు రంజిత్ "పరువు హత్యల"పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం ఆధారంగా జరిగే పరవు హత్యల్ని హింసగా చూడలేమని అన్నారు. రంజిత్ ఇలా సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఆగస్టు 9న తమిళనాడు సేలంలో తాను ఇటీవల దర్శకత్వం వహించిన ‘కవుందంపాళయం’ సినిమా గురించి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Honour Killing: తమిళనాడులోని విరుద్‌నగర్‌లో ‘పరువు హత్య’ చోటు చేసుకుంది. కార్తిక్ పాండీ(26) అనే వ్యక్తి, 8 నెలల క్రితం 22 ఏళ్ల నందిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబానికి ఇష్టం లేకుండా ప్రేమించిన వ్యక్తిని నందిని వివాహమాడింది.
Honour Killing: గ్రేటర్ నోయిడాలో ఇటీవల జరిగిన హత్య గుట్టు వీడింది. ఈ హత్యను ‘‘పరువు హత్య’’గా పోలీసులు తేల్చారు. తమ ఇష్టానికి విరుద్ధంగా కూతురు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో కక్ష పెంచుకున్న కుటుంబం అల్లుడిని దారుణంగా హతమార్చింది.
Honour killing: తమిళనాడులో పరువు హత్య జరిగింది. వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అమ్మాయి బంధువులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేరంలో అమ్మాయి బావ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని మెకానిక్‌గా పనిచేస్తున్న ప్రవీణ్(26)గా గుర్తించారు. ఈ ఘటన చెన్నై నగరంలోని పల్లికరణై సమీపంలో శనివారం చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన ప్రవీణ్‌ని…
Honour Killing: తమిళనాడులో దారుణం జరిగింది. తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని కుటుంబసభ్యులు హత్య చేశారు. ఈ ఘటన తంజావూరులో జరిగింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్న 19 ఏళ్ల యువతిని హత్య చేశారని, యువతి కుటుంబ బంధువలు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బీహార్ రాష్ట్రంలో ట్రిపుల్ మర్డర్ కేసు సంచలనంగా మారింది. తమను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు యువతి తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్యకు ఆమె సోదరుడు సహకరించాడు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో భార్యభర్తలను, వారి రెండేళ్ల చిన్నారిని యువతి తండ్రి, అన్న కలిసి హత్య చేశారు.
ఇటీవల కాలంలో ప్రేమ వ్యవహారాల్లో పరువు హత్యలు జరుగుతున్నాయి. తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమిస్తుందని, తన మాట వినడం లేదని తల్లిదండ్రులు కూతుర్లను చంపేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కుమర్తె ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆమెను, ఆమె లవర్‌ని ఘోరంగా హత్య చేశాడు.
Honour killing: ఇస్లాం ప్రాతిపదికగా ఏర్పడిన పాకిస్తాన్‌లో కొందరు మతఛాందసవాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. దీంతో అక్కడ అమ్మాయిలు, మహిళల స్వేచ్ఛకు పరిమితులు ఉంటున్నాయి. ఇదే కాకుండా పరువు హత్యల విషయంలో పాకిస్తాన్ టాప్ పొజిషన్‌లో ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న, ప్రేమించుకుంటున్న అక్కడ అమ్మాయిలను సొంత బంధువులు, కుటుంబ సభ్యులే క్రూరంగా హత్య చేస్తున్నారు.
Honour Killing: ‘పరువు’ పేరుతో పాకిస్తాన్ దేశంలో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. మానవహక్కుల నివేదిక ప్రకారం, పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 1000 మంది మహిళలు దారుణంగా హత్యలకు గురవుతున్నారు. మరోసారి మరో పరువు హత్య పాకిస్తాన్‌లో చర్చనీయాంశం అయింది. జంటకు హాని కలిగించొద్దని న్యాయమూర్తి హెచ్చరించినప్పటికీ అమ్మాయి కుటుంబీకులు అబ్బాయిని, అమ్మాయిని చంపేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే ఈ హత్యలకు కారణమైంది.
Relationship: చిన్న వయసులో సంబంధాలు పెట్టుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు తల్లిదండ్రులు వేరే కులానికి చెందిన వ్యక్తులను ప్రేమించారని కన్న కూతుళ్లను చంపడం కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలో ఇలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో తెలిసీ తెలియని వయసులో వేరే వ్యక్తిని ప్రేమించడం, వారితో సంబంధం కలిగి ఉండటం కూడా కూతుళ్ల హత్యలకు దారి తీస్తున్నాయి.