మనషుల్లో విలువలు రోజు రోజు దిగజారి పోతున్నాయి. క్షణిక సుఖాల కోసం వివాహేతర సంబంధాలు... డబ్బు కోసం మన, తన తేడా లేకుండా ఒకర్నొకరు చంపుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. సరిగ్గా ఇలాంటి కోణంలోనే ఒక హత్య జరిగింది. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన హత్య..
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది..
Gadwal Murder : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసు మొదట కనిపించినంత సాధారణం కాకుండా, దాని వెనుక ఉన్న కథనం ఆవిష్కరించబడుతున్న కొద్దీ నోరెళ్లబెట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 ఏళ్ల తేజేశ్వర్‌కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి కేవలం ఐదు రోజులు ముందు ఐశ్వర్య అనూహ్యంగా అదృశ్యమైంది. ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో…
Tragedy : ఇటీవల మేఘాలయలో చోటు చేసుకున్న రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసు సంచలనంగా మారింది. పెళ్లైన కొన్ని రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఈ ప్రాంతాన్ని షాక్‌కు గురి చేసింది. 33 ఏళ్ల తేజస్విన్ అనే సర్వేయర్‌ను ప్లాన్ చేసిన విధంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటనలో కొత్త…
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని చంపి భూమిలో పాతిపెట్టాడు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రియురాలి మృతదేహం ప్రియుడి ఇంటికి కొద్ది దూరంలో లభించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Honour Killing: పరువు హత్యలకు కేరాఫ్‌గా ఉన్న పాకిస్తాన్‌లో మరో హత్య జరిగింది. 17 ఏళ్ల యువతిని సొంత బంధువుల్లో ఒకరు కాల్చి చంపారు. టిక్ టాక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న సనా యూసఫ్‌ని ఇస్లామాబాద్‌లో తన ఇంట్లోనే చంపారు. ఇది పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా ఆమెకు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సనా యూసుఫ్‌ని బంధువు అతి దగ్గర నుంచి చంపినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.
Crime News: ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ జిల్లాలోని మైనాథేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం దారుణమైన సంఘటన వెలుగుచూసింది. శనివారం సాయంత్రం పశువుల కోసం పశుపోషణ నిమిత్తం మేత తీసుకురావడానికి ఇంటి నుండి బయటకు వెళ్లిన సైరా అనే యువతి ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే ఆ తర్వాత మరుసటి రోజు పొలాల్లో ఆమె రక్తంతో ఉన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహంపై బలమైన దాడుల చిహ్నాలు…
Tragedy : ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఒక భయంకరమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, ఒక భార్య తన ప్రియుడిని కలవడానికి అడ్డుగా ఉన్న సొంత భర్తనే హతమార్చింది. పోలీసులు నిందితురాలైన భార్యను అరెస్టు చేశారు. తన నేరాన్ని అంగీకరిస్తూ, భర్త తాగుబోతని, తనను వేధించేవాడని ఆమె పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం పోలీసులు హంతకురాలైన భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఎటా కొత్వాలి ప్రాంతంలోని గిర్ధాన్ గ్రామంలో మే 13వ తేదీ…
Father Suicide: కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా కూతురు పెళ్లి చేసుకున్న కారణంగా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. 49 ఏళ్ల మెడికల్ స్టోర్ యజమాని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రిషిరాజ్ అలియాస్ సంజూ జైస్వాల్గా గుర్తించిన ఆ వ్యక్తి తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుున్నాడు.
పెద్దపెల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య జరిగింది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో దుండగులు సాయికుమార్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అంటున్నారు. సాయికుమార్ జన్మదినం రోజే హత్య కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది.