Honour Killing: కర్ణాటకలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడితో పారిపోయిందని ఓ తండ్రి కన్న కూతురిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటన నాగనాథపురలోని డాక్టర్స్ లే అవుట్‌లో అక్టోబర్ 21న జరిగింది. కూతురిని చంపిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. నిందితుడిని మైసూరులోని హెచ్‌డీ కోటేలోని కలిహుండి గణేశ(50)గా గుర్తించారు. కూతురిని చంపే క్రమంలో అడ్డుగా వచ్చినందుకు భార్య శారదతో పాటు భార్య సోదరి గీత, అతని భర్త శాంతకుమార్ ను…
Honour killing: మరో పరువు హత్యకు 20 ఏళ్ల యువతి బలైంది. కులాంత సంబంధం పెట్టుకుందని 20 ఏళ్ల కూతురిని తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈఘటన కర్ణాటకలోని దేవనహళ్లీ తాలూకాలోని బిదలూర్ గ్రామంలో బుధవారం జరిగింది. దళిత వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందకు కూతురుని హత్య చేశాడు. తక్కువ కులానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించినప్పటికీ, మారకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు.
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం చూస్తున్నాం. తాము చేసిన తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి.
Honour killing: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమిస్తుందని కన్న తండ్రి కూతుర్ని చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రియుడిని కూడా దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మొరెనాలో జరిగింది. ఇద్దరు చనిపోయిన తర్వాత చంబల్ నదిలో ఇద్దరి మృతదేహాలను పారేశాడు. మొరేనా జిల్లా రతన్ బసాయి గ్రామానికి చెందిన శివాణి(18), సమీప గ్రామం బలుపురాకు చెందిన రాధేశ్యామ్ తోమర్(21) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన…
Honour Killing : రోజురోజులకు ఆధునిక టెక్నాలజీ సాయంతో ఇతర గ్రహాల్లో జీవించాలని మానవుడు ప్రయత్నిస్తుంటే.. మరో వైపు ఈ కాలంలో కూడా పరువు అంటూ నిండు జీవితాలను నాశనం చేస్తున్నారు.
ఆమె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి అది రెండో పెళ్లి. ఇది ఆమె కుటుంబానికి నచ్చలేదు. కోపంతో ఊగిపోయిన మహిళ మేనమామ.. ఆమె ఇంటికి వెళ్లాడు. మహిళను బయటకు ఈడ్చుకొచ్చి కొడవలితో గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆ 20 ఏళ్ల మహిళను హతమార్చాడు మేనమామ.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నారాయణ రెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నారాయణది పరువు హత్యగా తేల్చారు పోలీసులు. మృతుడి మామే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని నిర్థారించాడు. కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భరించని తండ్రి.. వీరిద్దరిని ఇంటికి పిలిపించాడు. తన అల్లుడైన నారాయణరెడ్డిని .. మామ వెంకటేశ్వర్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఘనంగా పెళ్లి చేస్తానంటూ.. ఢిల్లీలో ఉన్న కుమార్తె, అల్లుడిని ఇంటికి పిలిపించి కుమార్తెను గృహనిర్భందించి, వేరే…
బీహార్ లో పరువు హత్యకు స్కెచ్ వేశాడు ఓ మాజీ ఎమ్మెల్యే. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. అది కూడా వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని సొంత కూతురునే హతమార్చేందుకు ప్రయత్నించాడు. తన కూతురును చంపేలా కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిని నిర్వహించిన వ్యక్తి అయి ఉండీ..పరువు హత్యకు ప్రయత్నించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసుల ముందు గుట్టు విప్పడంతో సదరు ఎమ్మెల్యే క్రిమినల్ చర్య గురించి తెలిసింది.…
అభివృద్ధిలో.. టెక్నాలజీతో పోటీ పడుతూ అంతా పరుగులు పెడుతున్నా.. ఇంకా మతం, కులం లాంటివి అడ్డుగోడలుగా నిలిస్తున్నాయి.. పరువు తీశారని.. ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. కులాంతర వివాహం చేసుకున్నా.. మతాంతర వివాహం చేసుకున్నా జీర్ణించుకోలేక వెంటాడి వెంబడించి చంపేస్తున్నవారు కొందరైతే.. నమ్మించి గొంతుకోసే దారుణమైన మనుషులు కూడా ఉన్నారు.. తాజాగా, తమిళనాడులో జరిగిన డబుల్ మర్డర్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. Read Also: Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం…
ఇటీవల సరూర్ నగర్లో జరిగిన పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలకాంశాలు వెలుగులో వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నాగరాజును పథకం ప్రకారమే హత్య పోలీసులు వెల్లడించారు. నాగరాజు మొబైల్లో స్పైవేర్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసిన నిందితులు.. నాగరాజు హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి కదలికను మొబైల్ ద్వారా ట్రాక్ చేసినట్లు తెలిపారు. నిందితులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసినట్లు.. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్తో నాగరాజు హత్య చేసినట్లు పోలీసుల పేర్కొన్నారు.…