Honour Killing: తమిళనాడులో దారుణం జరిగింది. తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని కుటుంబసభ్యులు హత్య చేశారు. ఈ ఘటన తంజావూరులో జరిగింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్న 19 ఏళ్ల యువతిని హత్య చేశారని, యువతి కుటుంబ బంధువలు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Red Ant Chutney: “ఎర్ర చీమల” పచ్చడికి భౌగోళిక గుర్తింపు(GI).. ఈ వంటకం ప్రయోజనాలు, విశేషాలు..
నవీన్(19) దళితుడు. ఐశ్వర్య(19) ఇద్దరూ తంజావూరు జిల్లా పూవలూరు గ్రామం పట్టుకోట్టై నివాసులు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు. స్కూల్ డేస్ నుంచి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్ల క్రితం నవీన్ పని నిమిత్తం తిరుపూర్ వెళ్లగా.. అక్కడి బనియన్ కంపెనీలో చేరి పనిచేశాడు. నవీన్ రెండేళ్లుగా అక్కడ పని చేస్తుండగా, గతేడాది ఐశ్వర్యను తిరుపూర్ కు పిలిపించి ఓ ప్రైవేట్ కంపెనీలో నియమించారు. 18 నెలల లివ్ ఇన్ రిలేషన్ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐశ్వర్య తన కుటుంబీకులకు భయపడి, పెళ్లి చేసుకునేందుకు స్నేహితుల సాయాన్ని కోరింది. డిసెంబర్ 31, 2023లో వీరి వివాహం జరిగింది. ఆ తరువాత వీరు తేని జిల్లాలోని వీరపాండికి వెళ్లారు. తల్లిదండ్రులు కనపించడం లేదని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వీరిద్దర్ని గుర్తించి ఐశ్వర్యను జనవరి 2న కుటుంబ సభ్యులతో పంపారు.
అయితే, జనవరి 3న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ సమాచారం నవీన్‌కు తెలియజేయకుండా తల్లిదండ్రులు అంత్యక్రియలు చేశారు. అలాగే ఐశ్వర్య ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన నవీన్ పై కూడా ఐశ్వర్య బంధువులు దాడి చేసి పంపించి వేశారు. దీంతో నవీన్ వట్టత్తికోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తన భార్య మరణానికి కుటుంబమే కారణమని నవీన్ జనవరి 7న వట్టత్తికొట్టై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో ఐశ్వర్య కుటుంబంలోని 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ తమ వివాహానికి సాక్ష్యంగా వీడియోను సమర్పించాడు.