‘ద బ్యాట్ మేన్’ సినిమా మార్చి 4న జనం ముందు వాలగానే, ‘బ్యాట్ మేన్’ లవర్స్ మదిలో గబ్బిలం మనిషి పాత చిత్రాల తలంపులు మెదిలాయి. గతంలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ ట్రయాలజీ’ని తలచుకున్నారు ‘బ్యాట్ మేన్’ ఫ్యాన్స్. నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ బిగిన్స్’ (2005), ‘ద డార్క్ నైట్’ (2008), ‘ద డార్క్ నైట్ రైజెస్’ (2012) చిత్రాలు ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి. ఈ…
స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఈ పేరు వింటే చాలు ఇప్పటికీ ఎంతోమంది అభిమానుల మది ఆనందంతో చిందులు వేస్తుంది. ఆయన సినిమాలను చూసి ఎందరో దర్శకులుగా మారాలని పరుగులు తీశారు. స్పీల్ బెర్గ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా పలువురు డైరెక్టర్స్ గా మారారు. అలాంటి స్పీల్ బెర్గ్ తన ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వారా ఈ సారి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో నామినేషన్ పొందాడు. ఆయనతో పాటు `ద పవర్ ఆఫ్ ద డాగ్’ సినిమాతో జేన్ క్యాంప్లన్,…
సినీలవర్స్ అందరి నోటా ఇప్పుడు ద పవర్ ఆఫ్ ద డాగ్ మాటే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో 12 నామినేషన్స్ సంపాదించింది. అందునా ప్రధాన విభాగాలయిన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)లోనూ నామినేషన్స్ సంపాదించింది. దాంతో అందరి చూపు…
సినిమా హీరోలు ఎందుకు అంత పారితోషికం తీసుకుంటారు అనేది అందరి డౌట్.. కానీ సినిమాలో ఒక్కో సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి వారుచేసే కష్టం మాటల్లో చెప్పలేనిది. తాజాగా హాలీవుడ్ హీరో టామ్ హాలాండ్ ఒక సీన్ కోసం ఏకంగా 17 సార్లు కారుతో గుద్దించుకున్నాడట. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం అన్ ఛార్టెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అన్ ఛార్టెడ్ అనే వీడియో…
వసూళ్ళ వర్షం కురిపిస్తున్న స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా చూస్తే చాలు హీరో టామ్ హాలాండ్ కు కనెక్ట్ కాకుండా ఉండలేరు. పాతికేళ్ళ ఈ నటకిశోరం అప్పుడే వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అన్ చార్టెడ్ చిత్రాన్ని అంగీకరించాడు. కోవిడ్ కారణంగా షూటింగ్ కు అంతరాయం కలగడం, తరువాత అన్ చార్టెడ్లో నటించి, మళ్ళీ స్పైడర్ మేన్…
యూఫరియా అంటేనే అత్యంత ఆనందోత్సాహం. ఆ టైటిల్ ను టీనేజ్ డ్రామా కోసం ఏ ముహూర్తాన నిర్ణయించారో కానీ, యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. హెచ్.బి.ఓ. లో యూఫరియా సీజన్ 2 , జనవరి 9 న మొదలయింది. యువతను కిర్రెక్కిస్తోంది. 2019 జూన్ 16న తొలి సీజన్ మొదలై, అమెరికా జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగానూ ఈ సీరిస్ అలరించింది. నిజానికి యూఫరియాకు స్ఫూర్తి అదే పేరుతో ఇజ్రాయెల్ లో రూపొందిన టీనేజ్ డ్రామా.…
అమెరికన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటు సి.సి.ఏ, డి.జి.,ఏ, హెచ్ ఎఫ్.పి.ఏ, యన్.బి.ఆర్, పి.జి.ఏ, ఎస్.ఏ.జి వంటి సినిమా సంబంధిత సంస్థలు ప్రతీసారి అకాడమీ అవార్డ్స్ పై తమ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంస్థలు ఎంపిక చేసిన చిత్రాలకే ఆస్కార్ అవార్డ్స్ లోనూ ప్రాధాన్యత ఉంటుంది. ఆస్కార్ అవార్డ్స్ లో 23 విభాగాలు ఉన్నప్పటికీ, అన్నిటి కన్నా మిన్నగా ఉత్తమ…
స్పైడర్ మేన్ సీరిస్ లో తాజాచిత్రం స్పైడర్ మేన్ : నో వే హోమ్ విడుదలై అర్ధశతం పూర్తి చేసుకుంది. డిసెంబర్ 16న ఈ సినిమా జనం ముందు నిలచింది. యాభై రోజులు పూర్తవుతున్నా ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా 1.74 బిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీ లో దాదాపు ఒక వేయి మూడు వందల కోట్ల రూపాయలు. స్పైడర్…
వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉందని అంటూ ఉంటారు రసికులు. నాజూకు సోకుల నల్లకలువ హ్యాలీ బెర్రీ సైతం అదే పాట అందుకుంది. ప్రముఖ పాటగాడు వ్యాన్ హంట్ తో ఆమె ప్రేమాయణం సాగిస్తూ ఉందని జనానికి తెలుసు. కానీ, ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని, వాటిని విడదీసుకున్న హ్యాలీ తన 55 ఏళ్ళ వయసులో వ్యాన్ హంట్ పై మనసు పారేసుకోవడం విశేషమనే చెప్పాలి. జనవరి 1వ తేదీన వీరిద్దరూ జరుపుకున్న ఓ పార్టీకి సంబంధించిన…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వివాదాలు .. లవ్ స్టోరీలు, బ్రేకప్ లు.. అబ్బో ఒకటి కాదు.. రెండు కాదు చప్పుకొంటూ పోతే చాంతాడంతా లిస్ట్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రతి ఒక్కరితో సల్లు భాయ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇక మధ్యమధ్యలో హాలీవుడ్ హీరోయిన్లు కూడా యాడ్ అవుతూ ఉంటారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి అమెరికా భామ సమంత…