హాలీవుడ్ హీరో లియొనార్డో డికాప్రియో గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఈ హీరో సినిమాలోనే కాదు రియల్ గానూ హీరోనే. ఈ విషయం ఎన్నోసార్లు రుజువయ్యింది. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు ఇబ్బంది పడిన ప్రతిసారి నేను ఉన్నాను అంటూ తనవంతు సాయం ప్రకటిస్తూనే ఉంటాడు. ఇక తాజాగా మరోసారి ఈ టైటానిక్ హీరో తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ ల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెల్సిందే.
రష్యా భీకర దాడులతో దద్దరిల్లిపోయిన ఉక్రెయిన్ ప్రజలు నరకం చూస్తున్నారు. ఇక దీంతో ఉక్రెయిన్ కి లియోనార్డో తనవంతు సాయం ప్రకటించాడు. తనవంతుగా రూ.77 కోట్లను విరాళంగా అందించాడు. అయితే లియొనార్డ్ కి ఉక్రెయిన్ కి అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి. లియనార్డో అమ్మమ్మ హెలెన్ ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించింది. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి జర్మనీ వచ్చి సెటిల్ అయినా ఉక్రెయిన్ తో సంబంధాలు మాత్రం కొనసాగుతూనే వచ్చాయి. ఈ కారణంగా కూడా లియనార్డో ఉక్రెయిన్ కి అండగా నిలిచాడు. దీంతో నిజంగా నువ్వు రియల్ హీరో వి అంటూ నెటిజన్స్ టైటానిక్ హీరోను పొగిడేస్తున్నారు.