సినిమా హీరోలు ఎందుకు అంత పారితోషికం తీసుకుంటారు అనేది అందరి డౌట్.. కానీ సినిమాలో ఒక్కో సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి వారుచేసే కష్టం మాటల్లో చెప్పలేనిది. తాజాగా హాలీవుడ్ హీరో టామ్ హాలాండ్ ఒక సీన్ కోసం ఏకంగా 17 సార్లు కారుతో గుద్దించుకున్నాడట. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం అన్ ఛార్టెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అన్ ఛార్టెడ్ అనే వీడియో గేమ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇక ఇందులో చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెల్స్ అద్భుతంగా ఉండనున్నాయట. వీటికోసం టామ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఒక యాక్షన్ సీన్ లో హీరో కారుతో గుద్దించుకోవాల్సి ఉండగా.. ఆ సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం 17 సార్లు కారుతో గుద్దించుకొని షాట్ ని ఒకే చేశాడంట. ప్రస్తుతం షూటింగ్ పూరేతి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 18 న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో స్పైడర్ మ్యాన్ మరో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.