పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పోటీలు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతాయి. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్ 7న ముగుస్తుంది. అయితే.. భారత్‌లో జరిగే పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై చర్చ జరిగింది.
Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల హాకీ జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. PR శ్రీజేష్ రిటైర్మెంట్ తర్వాత, క్రిషన్ బహదూర్ పాఠక్ ను ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రధాన గోల్ కీపర్‌గా నియమించారు. హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నీలో ఆసియాలోని టాప్ హాకీ ఆడే దేశాలు భారత్, కొరియా, మలేషియా, పాకిస్థాన్, జపాన్, ఆతిథ్య చైనాలు…
PR Sreejesh: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ఈ విజయంలో గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఒలింపిక్ క్రీడల తర్వాత అతను హాకీ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు హాకీ ఇండియా అతని గౌరవార్థం ఈ మాజీ భారత గోల్ కీపర్ జెర్సీ నంబర్ 16 ను రిటైర్ చేసింది. దీంతో పాటు జూనియర్ జట్టుకు…
Indian Goalkeeper PR Sreejesh Retirement: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరోసారి అద్భుతం చేసింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓడిన భారత్.. కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. స్పెయిన్‌పై గెలిచి పతకం గెలవడమే కాదు.. భారత హాకీకి పెట్టని కోట గోడగా పేరొందిన పరట్టు రవీంద్రన్ శ్రీజేశ్ (పీఆర్ శ్రీజేశ్)కు ఘనమైన వీడ్కోలు పలికారు. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేసిన గోల్‌కీపర్…
Cash Prize for Hockey India Team: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత్ కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో…
India vs Germany Semis Match in Paris Olypics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో నేడు భారత హాకీ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. మంగళవారం జరిగే సెమీ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఢీకొంటుంది. గత ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత్.. ఈసారి రజతం లేదా స్వర్ణ పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న జర్మనీని ఓడించడం భారత్‌కు అంత సుళువేమీ కాదు. కానీ క్వార్టర్స్‌లో దాదాపు 40…
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఈరోజు బిగ్ మ్యాచ్ జరగనుంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9-0 తేడాతో గెలిచిన భారత్.. పాకిస్థాన్‌తోనూ అదిరిపోయే ఆటతో ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. Read Also: కోహ్లీ వ్యాఖ్యలపై ‘మేం చూసుకుంటాం’ అని స్పందించిన దాదా 2018 మస్కట్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్…
టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశ క్రీడాకారులు హాకీ , బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వక్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. తద్వారా దేశీయ క్రీడ హాకీ విశ్వక్రీడా వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు .ఇందుకు తీవ్రంగా కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ ను, జట్టు క్రీడాకారులను…
భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఒలింపిక్స్ హాకీలో…క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో…ఆస్ట్రేలియాను ఓడించి…సంచలనం సృష్టించింది. మూడుసార్లు ఒలింపిక్ విజేత ఆస్ట్రేలియాను మట్టి కరిపించి…సెమీస్‌కు సిద్ధమైంది రాణి రాంపాల్ సేన.ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు జరిగే సెమీస్‌లో అర్జెంటీనాతో రాణి రాంపాల్ సేన తలపడనుంది. అందులో గెలిస్తే.. ఇక మహిళ హాకీ చరిత్ర మలుపు తిరగడం ఖాయం!పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును క్వార్టర్స్‌లో ఓడించడంతో…మహిళల హాకీ జట్టుపై అందరికీ అంచనాలు పెరిగాయ్. సెమీస్‌లోనూ అర్జెంటీనా జట్టును ఓడించి…ఫైనల్‌కు…
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టుకు రాణి రాంపాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుందని హాకీ ఇండియా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును గత వారం ప్రకటించిన హెచ్‌ఐ కెప్టెన్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక వైస్ కెప్టెన్‌లుగా గోల్‌కీపర్ సవిత, దీప్ గ్రేస్ ఎక్కా వ్యవహరిస్తారని తెలిపింది. ఒలింపిక్స్‌లో జట్టును నడిపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది రాణి. ఇప్పటివరకు దేశం తరఫున 241 మ్యాచ్‌లు ఆడి…