PR Sreejesh: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ఈ విజయంలో గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఒలింపిక్ క్రీడల తర్వాత అతను హాకీ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు హాకీ ఇండియా అతని గౌరవార్థం ఈ మాజీ భారత గోల్ కీపర్ జెర్సీ నంబర్ 16 ను రిటైర్ చేసింది. దీంతో పాటు జూనియర్ జట్టుకు కొత్త కోచ్‌గా నియమించింది.
G.O.A.T: G.O.A.T సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
2012లో శ్రీజేష్ తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ఆ ఎడిషన్‌లో భారత్ 12వ స్థానంలో నిలిచింది. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. ఆ జట్టుకు శ్రీజేష్ నాయకత్వం వహించాడు. దీని తరువాత, 2021లో ఆడిన టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇందులో కూడా శ్రీజేష్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను తన రెండవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడం ద్వారా 2024లో తన కెరీర్‌ను ముగించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంతో కీలక పాత్ర వహించాడు.
Robbery: దొంగతనానికి వెళ్లి మరణించిన యువకుడు.. శవాన్ని రహస్యంగా పాతిపెట్టిన స్నేహితులు..