Kumkum on Coconut: హిందూ సాంప్రదాయంలో దేవుడికి పూజ చేసేటప్పుడు లేదా ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఒక ముఖ్యమైన ఆనవాయితీ. అయితే టెంకాయ కొట్టిన తర్వాత ఆ చిప్పల మీద కుంకుమ బొట్టు పెట్టాలా? వద్దా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరికాయకు ఎప్పుడూ కూడా కుంకుమ పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. దీనికి ప్రధాన కారణం ‘శుద్ధత’. దేవుడికి సమర్పించే ప్రసాదం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, మనం తినడానికి…
Karthika Deepam: హిందూ ధర్మంలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః, దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః అనే శ్లోకం దీపం పరబ్రహ్మ స్వరూపమని, పాపాలను హరించే శక్తి దీనికి ఉంటుందని తెలియజేస్తుంది. ఈ దీపం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ప్రతి రోజు దీపారాధన చేసేవారు, శుభ ఫలితాలు పొందడానికి జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. Read Also: Minister Nara Lokesh: తాజా…
నాగుల చవితి రోజున పాము పుట్టలో పాలు పోయడం వెనకున్న రహస్యం ఏంటంటే. మనం విగ్రహానికి నైవేద్యం పెట్టినపుడు దేవుడు ఆ ప్రసాదాన్ని కాక మన భక్తిని, ప్రేమను స్వీకరిస్తాడు.
Saraswati Pushkaralu : తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గురువారం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై, నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం, పూలు, పండ్లు…
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం…