Sankata Hara Chaturthi: వినాయకుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన వ్రతాలలో సంకటహర చతుర్థి ఒకటి అని చెప్పాలి. ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే నాలుగవ రోజున ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ రోజున భక్తులు గణపతికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ‘సంకటహర’ అంటే ప్రమాదాల నుంచి లేదా కష్టాల నుంచి విముక్తి లభించడం అని అర్థం. అయితే, కొత్త ఏడాది 2026 జనవరి 6న (ఈరోజు) ఈ సంకట హర చతుర్థి వచ్చింది. ఈ రోజు అత్యంత అరుదైన రోజని వేద పండితులు చెబుతున్నారు. ఇవాళ ఆశ్లేష నక్షత్రం, ఆదిశేషుడు.. నాగేంద్ర స్వామి వారి నక్షత్రం.. రెండు తలల నాగరాజుకు ఈ రోజు అభిషేకం చేస్తే కోరిన కోరికలు శీఘ్రగతిన నెరవేరుతాయని పేర్కొంటున్నారు.
Read Also: Bitcoin Scam Case: బిట్‌కాయిన్ స్కామ్‌లో శిల్పా శెట్టి భర్తకు కోర్టు బిగ్‌షాక్..
ఇక, ఇవాళ పగలు తదియ తిథి వచ్చింది. ఇది ఉదయం 11.36 గంటల వరకు ఉంటుంది. అనంతరం చవితి తిథి స్టార్ట్ అవుతుంది. అంటే మంగళవారం ఉదయం 11.37 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 10.46 గంటల వరకు ఈ చవితి తిథి ఉండనుంది. చవితి తిథి.. చంద్రోదయం సమయం ఉంటుందో ఆ రోజే సంకట హర చతుర్థిని జరుపుతారు. ఈ నేపథ్యంలో ఇవాళ సంకట హర చతుర్థి వస్తుంది. మంగళవారం ఆశ్లేష నక్షత్రం రావడంతో ఈ రోజును అంగారక సంకష్ట హర చతుర్థిగా పేర్కొంటారు. ఇక, చంద్రోదయ సమయం వచ్చి.. మంగళవారం రోజు రాత్రి 9.50 నిమిషాలకు ఉంటుంది.
Read Also: Falcon Scam: రూ.850 కోట్ల ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో ఎండీ
అయితే, ఈ సంకట హర చతుర్థి రోజు.. గణపతి ఆలయంలో 3, 11, 21 ప్రదక్షిణలు చేయడం మంచిది. అలాగే, గణపతికి గరిక సమర్పించడం.. సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం మంచిది. ఇక, ఉదయం నుంచి ఉపవాసం చేయాలి, పాలు, పళ్లు తీసుకోవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు. చంద్రోదయం తర్వాత చంద్రుడు లేదా నక్షత్ర దర్శనం చేసుకోవడం ఉత్తమం. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలను సమర్పించి.. సాత్విక ఆహారం తీసుకోవడం బెటర్. ఇక, ఈ ఉపవాసం చేయలేని వారు.. కనీసం నాలుగు సార్లు సంకట నాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం వలన ఆ విఘ్నేషుడు ఆశీస్సులు లభించనున్నాయి.
కాగా, జాతకంలో కేతు గ్రహ ప్రభావం బలంగా ఉండి.. పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు.. ఈ సంకట హర చతుర్థి నాడు.. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి.. గణపతికి నమస్కరించి.. దీపారాధన చేసి.. పాలు నైవేద్యంగా సమర్పించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే, ఇవాళ ఉపవాసం ఉండటం.. సాయంత్రం వినాయకుడిని పూజించి భోజనం చేయాల్సి ఉంటుందని వేద పండితులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతున్నారు.