Kumkum on Coconut: హిందూ సాంప్రదాయంలో దేవుడికి పూజ చేసేటప్పుడు లేదా ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఒక ముఖ్యమైన ఆనవాయితీ. అయితే టెంకాయ కొట్టిన తర్వాత ఆ చిప్పల మీద కుంకుమ బొట్టు పెట్టాలా? వద్దా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరికాయకు ఎప్పుడూ కూడా కుంకుమ పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. దీనికి ప్రధాన కారణం ‘శుద్ధత’. దేవుడికి సమర్పించే ప్రసాదం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, మనం తినడానికి అనువుగా ఉండాలి. కొబ్బరి చిప్పపై కుంకుమ ఉంచడం వల్ల, అది లోపల ఉన్న కొబ్బరిపై పడి ఆ నైవేద్యం అశుద్ధం అయ్యే అవకాశం ఉంది. అందుకే దేవుడికి కొట్టే కాయ మీద కుంకుమ పెట్టకూడదు.
BDL Apprenticeship 2025: 10th, ITI అర్హతతో.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్.. మీరూ ట్రై చేయండి
అయితే అన్ని సందర్భాల్లోనూ కొబ్బరికాయపై కుంకుమ నిషిద్ధం కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో టెంకాయ కొట్టిన తర్వాత కచ్చితంగా కుంకుమ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా దిష్టి తీసినప్పుడు, ఇంటికి లేదా వ్యాపార స్థలానికి గుమ్మం వద్ద కొట్టినప్పుడు, అలాగే కొత్త వాహనాలకు పూజ చేసి కింద కొట్టినప్పుడు ఆ కాయకు కుంకుమ పెట్టాలి. “నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది” అంటారు. కాబట్టి ఇలాంటి సమయాల్లో కొట్టే కాయపై కుంకుమ వేయడం ద్వారా దోష నివారణ జరుగుతుందని నమ్మకం.
BDL Apprenticeship 2025: 10th, ITI అర్హతతో.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్.. మీరూ ట్రై చేయండి
దీని వెనుక ఒక బలమైన ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. గుమ్మం దగ్గర, వాహనాల దగ్గర లేదా దిష్టి తీసి కొట్టే కొబ్బరికాయను “బలి హారణం” అంటారు. అంటే అది దుష్ట శక్తులకు, భూత ప్రేతాదులకు ఇచ్చే ఒక రకమైన బలి. ఆ శక్తులను శాంతింపజేయడానికి ఎరుపు రంగు లేదా కుంకుమను వాడతారు. కానీ దేవుడికి మనం సమర్పించేది నైవేద్యం. కాబట్టి భగవంతుడికి ఇచ్చే టెంకాయను కేవలం నీటితో శుద్ధి చేసి సమర్పించాలి తప్ప కుంకుమతో కాదు. క్లుప్తంగా చెప్పాలంటే దేవుడికి కొట్టే కొబ్బరికాయకు కుంకుమ పెట్టకూడదు. అదే దిష్టి కోసం లేదా వాహనాల కోసం కొట్టే కాయకి తప్పనిసరిగా కుంకుమ పెట్టాలి.